ఆస్ట్రేలియాలో తుఫానులు…కొత్త ప్రమాదాలు…తగినంత ఉపశమనం

ఆస్ట్రేలియాలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. ఒక పక్క అడవులు అగ్నికి ఆహుతి అవుతుంటే, మరో పక్క వడగళ్ల వానలు, వరదలుతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. మరోవైపు ఆకాశాన్ని కమ్మేసిని ధూళి దండయాత్ర చేస్తున్నట్లు గ్రామాలు, పట్టణాలపై విరుచుకు పడింది. అయితే ఇటీవల కాలంలో దశాబ్దాలలో ఎప్పుడూ లేని విధంగా ఆస్ట్రేలియాలో కార్చిచ్చు కారణంగా లక్షలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో అగ్నిని ఆర్పేందుకు పోరాడుతున్న అగ్నిమాపక సిబ్బందికి ప్రస్తుతం అక్కడి వాతావరణ పరిస్థితులు కొంత ఉపశమనం కలిగించాయి.
అయితే రాబోయే రోజుల్లో చాలా అవసరమయ్యే చోట వర్షం పడుతుంది, లేదా ఇది అగ్ని-నాశనమైన మరియు కరువుతో బాధపడుతున్న ప్రాంతాలలో తేడాను కలిగించనుందా అనేది వాతావరణ శాఖ క్లారిటీగా చెప్పలేదు. ఇప్పటివరకు మంటలను ఆర్పడానికి తగినంత వర్షం అయితే పడలేదు. తుఫానుల మెరుపులు కారణంగా కొత్త మంటలను రేకెత్తే అవకాశముంది. మరోవైపు భారీగా ఉప్పెనలు కొన్ని సంవత్సరాల కరువు కొన్ని ప్రాంతాలను చాలా పొడిగా ఉంచినందున శక్తివంతమైన ఫ్లాష్ వరదలకు దారితీస్తుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
తుఫాను కారణంగా జరిగిన నష్టాన్ని తెలియజేస్తూ విక్టోరియా స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ పలు ఫొటోలను ఫేస్ బుక్ లో షేర్ చేసింది. ఆస్ట్రేలియాలో రెండవ అతి పెద్ద నగరమైన మెల్ బోర్న్ లో 77మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీని కారణంగా పలుచోట్ల వరదలు వచ్చి పలుచోట్ల ఆస్తినష్టం సంభవించిందని విక్టోరియా బ్యూరో ఆఫ్ మెట్రాలజీ తెలిపింది.
విక్టోరియాకు ఉత్తరాన ఉన్న న్యూ సౌత్ వేల్సే టౌన్ లో తుఫాను కారణంగా 10వేలకు పైగా గృహాలకు,వ్యాపారాలకు కరెంట్ సప్లయ్ నిలిచిపోయినట్లు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. అయితే కార్చిచ్చుతో పోరాడుతున్న అధికారులకు తుఫానులు కూడా సహాయపడ్డాయని తెలిపాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కురుస్తున్న వర్షం అన్ని మంటలను ఆర్పలేనప్పటికీ, మంటను నిరోధించేదిగా చాలా దూరం వెళ్తుందిని న్యూ సౌత్ వేల్స్ రూరల్ ఫైర్ సర్వీస్(RFS) ట్వీట్ చేసింది.