Millionaire Girl pixie curtis : బొమ్మల వ్యాపారంతో రూ. కోట్లు సంపాదిస్తున్న 10 ఏళ్ల చిన్నారి..

బొమ్మల వ్యాపారంతో 10 ఏళ్ల చిన్నారి రూ. కోట్లు సంపాదిస్తోంది. వ్యాపారవేత్తలకే సవాలు విసురుతోంది.

Millionaire Girl pixie curtis : బొమ్మల వ్యాపారంతో రూ. కోట్లు సంపాదిస్తున్న 10 ఏళ్ల చిన్నారి..

Millionaire Australian Girl (1)

Australian 10 years girl pixie curtis a millionaire : ఆస్ట్రేలియు చెందిన పిక్సీ కర్టిస్ అనే 10 ఏళ్ల చిన్నారి కోట్లు సంపాదిస్తోంది. అతి చిన్నవయస్సులోనే సంపన్నురాలుగా అవతరించింది. 10 ఏళ్ల ఈ చిచ్చరపిడుగు పిక్సీస్ ఫిడ్జెట్స్ ఆఫ్ మిలియనీర్ పిక్సీ అనే కంపెనీ కూడా నిర్వహిస్తోంది. 10 ఏళ్ల పిల్లలలంటే బొమ్మలతో ఆడుకుంటారు. ఐస్ క్రీములు కావాలి, చాక్లెట్లు కావాలి అని మారాం చేస్తారు. కానీ ఈ చిచ్చరపిడుగు మాత్రం ఏకంగా కోట్ల రూపాయలు సంపాదించేస్తు..వ్యాపారవేత్తలకు కూడా సవాల్ విసురుతోంది. ఈ పిల్ల నిర్వహించే కంపెనీతో కోట్లలో ఆదాయం ఆర్జిస్తోంది. పిక్సి కర్టిస్ తల్లి రాక్సీ కూడా ఈ చిన్నారికి సహాయం చేస్తుంటుంది. పిక్సి తల్లి విజయవంతమైన పబ్లిక్ రిలేషన్స్ గురు రాక్సీ మేనేజర్ గా ఉన్నారు. పిల్లల బొమ్మలు, పిల్లలకు అవసరమయ్యే స్టేషనరీ, సరదా గాడ్జెట్స్ వంటివి అమ్ముతుంది. కొత్తగా వచ్చే బొమ్మలకు రివ్యూ ఇస్తుంది. అవి ఎలా వాడాలో, వాటి ధర ఎంతో, ఏ వయసు వారికి బాగుంటాయో చెబుతుంది.

Read more : World Record: Lip Balmsతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఆరేళ్ళ చిన్నారి..

అలా తల్లిని చూస్తు పెరిగిన పిక్సి..  వాళ్లమ్మను  ‘‘మమ్మీ నాకు సొంతంగా వ్యాపారం చేయాలని ఉంది’’ అని చెప్పింది. దీంతో తల్లికి ఆశ్చర్యపోయింది. ఏదో సరదాగా అంటోందేమో అనకుంది. కానీ కూతురు పట్టుదల చూశాక తల్లిగా నేను తప్పకుండా చేసి తీరాలని అనుకుంది. కూతురు కోరికతో తల్లి రాక్సీ, కుమార్తె పిక్సీ వ్యాపారాన్ని ప్రారంభించారు. అప్పటికే కూతురు పేరుతో ప్రారంభించిన  ‘పిక్సీస్ బౌస్’  చిన్నపాటి వ్యాపారాన్ని కూతురికి అప్పగించింది. ఆ పేరుతోనే బొమ్మలు అమ్మటం మొదలుపెట్టారు. మొదట్లో రకరకాల బొమ్మల్ని సేకరించి.. వాటిని అమ్మటం మొదలుపెట్టారు.

ఇలా కూతురు సరదా కోసం ప్రారంభించిన ఈ వ్యాపారం అనూహ్యంగా చక్కటి లాభాలు రావటం మొదలుపెట్టింది. వారు సేకరించిన బొమ్మలు 48 గంటల్లో అమ్ముడు పోవడంతో ఆ వ్యాపారాన్ని ఇంకాస్త పెంచారు.  అలా తల్లితో కలిసి బొమ్మలు తయారు చేసి వాటిని అమ్మేవారు. మంచి స్పందన వచ్చింది. వీరి బొమ్మలకు చక్కటి డిమాండ్ వచ్చింది. అలా వారి వ్యాపారం పెరిగింది.  అలా గత నవంబర్ లో వారి వ్యాపారం ద్వారా 105,000 పౌండ్లు అంటే 1 కోటి 5 లక్షలకు పైగా సంపాదించింది. ఇలా చిన్నప్పటి నుంచే వ్యాపారంలో కిటుకులు తెలుసుకున్న పిక్సీ ఇప్పుడు నెలకు రెండు వ్యాపారాల ద్వారా కోటి రూపాయలకుపైనే సంపాదిస్తోంది.

బొమ్మల బిజినెస్ బాగా నడవటంతో తల్లీకూతుళ్లు హెయిర్ యాక్సెసరీ బ్రాండ్‌ను కూడా క్రియేట్ చేశారు. దీంట్లో స్టైలిష్ హెయిర్‌బ్యాండ్‌లు, హెయిర్ క్లిప్‌లు మరియు ఇతర ఉపకరణాలు ఈ హెయిర్ యాక్సెసరీస్ బ్రాండ్‌లో అమ్ముతుంటారు. అలా తమకంటూ ఓ సరికొత్త ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. దానికి పిక్సీస్ బోస్ అని పేరు పెట్టారు. తల్లి కాస్త రిలాక్స్ అవుతుందేమో గానీ ఈ చిచ్చరిపిడుగు మాత్రం తన వ్యాపారం విషయంలో ఏమాత్రం రిలాక్స్ అవ్వదు. కొత్త కొత్త బొమ్మల్ని తన వ్యాపారంలో ఎలా పెట్టాలా? అనే ఆలోచనలోనే ఉంటుంది. అలా ఆమె సిడ్నీలో అతి చిన్నవయస్సులోనే సక్సెస్ పుల్ బిజినెస్ గర్ల్ గా పేరొందింది.

Read more : గంటలో 30రకాల వంటలు వండుతున్న 10ఏళ్ల బాలిక

బొమ్మలు, బట్టలు, ఉపకరణాలు దీని ద్వారా పిక్సీ వ్యాపారం మూడు బొమ్మలు ఆరు ఐడియాలా పీక్స్ లోకి వెళ్లిపోయింది. వీటన్నింటికీ 10 సంవత్సరాల పిక్సీ యాజమానే కావటం మరో విశేషం అని చెప్పి తీరాలి. ఎందుకంటే ఆ వయస్సులో వ్యాపారం చేయాలని ఐడియా..దాన్ని కొనసాగించే నేర్పు  సామాన్యమైనది కాదు. పిక్సీ తల్లి రాక్సీ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ కావటం పిక్సీకి బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి..పిల్లలకు ఎటువంటి గిఫ్టులు ఇవ్వాలి? వారి బట్టలు ఎలా ఉండాలి? ఏఏ సందర్భాల్లో ఎటువంటి డ్రెస్ వేసుకోవాలి? వంటి ఎన్నో విషయాలపై సలహాలు, సూచనలు ఇస్తూ పిక్సీ వ్యాపారానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అన్నింటిని ఆకళింపు చేసుకున్న ఈ చిచ్చరపిడుగు వ్యాపారంలో నెలకు కోట్లు సంపాదిస్తోంది.

ఇంత చిన్న వయసులో పిక్సీలో వ్యాపారం చేయాలనే కోరిక ఉండేదని కానీ నేను సక్సెస్ కాలేకపోయాను. కానీ నా కూతురు నా కలను నెరవేర్చింది. “నాకు 14 ఏళ్ళ వయసులో మెక్‌డొనాల్డ్స్‌లో ఉద్యోగం వచ్చింది. ఆ వయస్సులో నాకు ఉద్యోగం మాత్రమే వచ్చింది. కానీ అంతకంటే చిన్నవయస్సులోనే నా కూతురు ఏకంగా వ్యాపారమే ప్రారంభించి సక్సెస్ అందుకుందని మురిసిపోతు చెబుతోంది.10 ఏళ్ల పిక్సి ప్రస్తుతం సిడ్నీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది.  మదర్ రాక్సీ PRతో సహా అనేక విజయవంతమైన కమ్యూనికేషన్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.

Read more : World’s longest hair :పొడవాటి జుట్టుతో గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిన యువతి..12 ఏళ్లకు హెయిర్ కట్టింగ్..

పిక్సీ ఓ పక్క చదువుకుంటునే మరో పక్క తన వ్యాపారాన్ని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. ఇంత చిన్నవయస్సులోనే పిక్సీ..ఆమె సోదరుడికి 14 మిలియన్ల కాస్ట్లీ కారును కలిగి ఉన్నారు.