గంటలో 30రకాల వంటలు వండుతున్న 10ఏళ్ల బాలిక

గంటలో 30రకాల వంటలు వండుతున్న 10ఏళ్ల బాలిక

Kerala:ఓ పదేళ్ల పిల్ల గంటలో 30కంటే ఎక్కువ వంటలు (Food Items) రెడీ చేయగలదు. ఊతప్ప, ఫ్రైడ్ రైస్, చికెన్ రోస్ట్ లాంటి వంటలన్నీ ఒకే చోట గంటలోపు సమయంలోనే తయారుచేసి రికార్డుల్లో చోటు దక్కించుకుంది.

వింగ్ కమాండర్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రాజిత్ బాబు కూతురు శాన్వి ఎం ప్రాజిత్ ప్రశంసలు అందుకుంటోంది. ఎర్నాకులానికి చెందిన ఈమెకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లలో స్థానం దక్కించుకుంది.



ఓ చిన్న పిల్ల చాలా వంటలు చేయగలుగుతుందనే పేరుతో రికార్డు నమోదైంది. శాన్వి మొత్తం 33రకాల వంటలు రెడీ చేసింది. ఇడ్లీ, వాఫెల్, కార్న్ ఫ్రిట్టర్స్, పుట్టగొడుగుల టిక్కా, ఊతప్పం, పన్నీర్ టిక్కా, ఎగ్ బుల్స్ ఐ, శాండ్‌విచ్, పాప్డీ ఛాట్, ఫ్రైడ్ రైస్, చికెన్ రోస్ట్, పాన్ కేక్, అప్పం లాంటి వాటివెన్నో రెడీ చేసేసింది.

ఈ రికార్డును ఆగష్టు 29న 10సంవత్సరాల 6నెలల 12రోజుల వయస్సున్న బాలిక నమోదు చేసింది. ‘విశాఖపట్నంలోని బాలిక ఇంట్లో చేస్తుండగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అథారిటీ దీనిని ఆన్ లైన్‌లో పర్యవేక్షించింది’ సాక్ష్యంగా ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లు 33ఐటెంలు రెడీ చేస్తుండగా తల్లి మాంజిమాతో పాటు అక్కడే ఉన్నారు.

ఫ్యామిలీ, స్నేహితుల అండతో ఇది సాధించగలిగానని శాన్వి తర్వాత చెప్పింది. స్టార్ చెఫ్ అయిన ఆమె తల్లి.. రియాలిటీ కుక్కరీ ఫైనలిస్ట్ ఇన్‌స్పిరేషన్ తోనే ఇది సాధించానని చెప్పింది. ఇంకా చిన్న వయస్సులోనే తల్లితో పాటు వంటగదిలో అద్భుతంగా వంటలు చేసేదని కుటుంబ సభ్యులు అంటున్నారు.

శాన్వి చిల్డ్రన్ కుక్కరీ షోలలో కూడా చాలా సార్లు పాల్గొంది. ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తూ.. రుచికరమైన వంటల రెసిపీలను ఫాలోవర్లతో పంచుకుంటున్నారు.