తల్లి IUDని చేత్తో పట్టుకుని పుట్టిన శిశువు

పేషెంట్లతో డీల్ చేస్తున్నప్పుడు డాక్టర్లు వందల రకాలు కంప్లైంట్లు వస్తుంటాయి. వాటిల్లో కొన్ని అరుదైన కేసులు ఉండిపోతాయి. వియత్నాంలో జరిగిన ఘటన ఫొటోలో ఓ క్యూరియస్ ఆబ్జెక్ట్ ఆశ్చర్యం కలిగించేలా ఉంది. హై ఫాంగ్‌లోని హై ఫాంగ్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ లో బాబు పుట్టాడు. ఆ బుడ్డోడు చేతిలో IUDపట్టుకుని (ఇంట్రాయుటేరిన్ డివైజ్)పట్టుకుని కేరింతలు కొడుతున్నాడు.
డా.ట్రాన్ వియెట్ ఫాంగ్ ఆ ఘటనను ఫొటో తీసి ఫేస్ బుక్‌లో పంచుకున్నాడు. నలుపు, పసుపు రంగుల్లో ఉన్న కాంట్రాసెప్టివ్ కాయిల్ పట్టుకుని దిగాడు. ఈ పోస్టుకు 3వేల 500లైకులు రాగా 4వేల షేర్లు సంపాదించుకున్నాడు. ‘డెలివరీ తర్వాత చిన్నారి డివైజ్ పట్టుకుని ఉండడం ఇంటరెస్టింగ్ గా అనిపించింది. పిక్చర్ తీశాను. దీనికి ఇంత అటెన్షన్ వస్తుందని ఊహించలేదు’ అని డా.ఫాంగ్ అన్నాడు.
రెండేళ్ల క్రితం 34ఏళ్ల మహిళకు ఐయూడీ వచ్చింది. అనుకోకుండా ప్రెగ్నెన్సీ సమయంలో అది బయటపడిపోయింది. ఐయూడీలు అంటే టీ షేప్ లో ఉండి బర్త్ ను కంట్రోల్ చేస్తూ ఉంటాయి. దీనిని యుటరస్ లో చొప్పిస్తారు. నిజానికి ఇవి గర్భం పోకుండా ఉండడానికి, బర్త్ కంట్రోల్ పిల్స్ లా ఉపయోగపడతాయి. ఐయూడీ యాక్సిడెంటల్ గా ఫెయిల్ అయితే అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి దారి తీయొచ్చు.
వియత్నాంలో జరిగిన ఈ ప్రసవం మాత్రం ఆశ్చర్యం అనిపించిందని డాక్టర్ అంటున్నారు. ఆ టీ షేప్ యూఐడీని చేత్తే పట్టుకుని ఆరోగ్యంగా 3.2కేజీలతో పుట్టాడు. ఇప్పుడు తల్లికి మూడో సంతానం అయ్యాడు.