Bangladesh: రాజ్యాంగం నుంచి లౌకికవాదం, సోషలిజాన్ని తొలగించాలని బంగ్లాదేశ్ కమిషన్ ప్రతిపాదన

ఇప్పుడు వీటిల్లో ప్రజాస్వామ్యాన్ని మాత్రమే మార్చవద్దని బంగ్లా రాజ్యాంగ సంస్కరణల కమిషన్ తమ నివేదికలో పేర్కొంది.

Bangladesh: రాజ్యాంగం నుంచి లౌకికవాదం, సోషలిజాన్ని తొలగించాలని బంగ్లాదేశ్ కమిషన్ ప్రతిపాదన

Muhammad Yunus

Updated On : January 16, 2025 / 7:57 AM IST

బంగ్లాదేశ్‌ మూలసూత్రాలైన లౌకికవాదం, సామ్యవాదం, జాతీయవాదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలని ఆ దేశ రాజ్యాంగ సంస్కరణల కమిషన్ ప్రతిపాదించింది. ఈ మేరకు బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ ముహమ్మద్ యూనస్‌కు నివేదికను సమర్పించింది.

ఈ కమిషన్‌ను యూనస్‌ తాత్కాలిక ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. విద్యార్థుల నిరసనల వల్ల బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఆ దేశం వదిలి వెళ్లిపోయాక ఆ దేశంలో ముహమ్మద్ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. బంగ్లాలో ఇప్పటివరకు ఏకసభ పార్లమెంట్‌ ఉంది.

దీన్ని ద్విసభ పార్లమెంటుకు మార్చాలని కూడా దేశ రాజ్యాంగ సంస్కరణల కమిషన్ ప్రతిపాదించింది. బంగ్లాదేశ్‌లో ఇప్పటివరకు విధానపర ప్రాథమిక మూల సూత్రాలుగా నాలుగు అంశాలు ఉన్నాయి. అవే లౌకికవాదం, సామ్యవాదం, జాతీయవాదం, ప్రజాస్వామ్యం.

ఇప్పుడు వీటిల్లో ప్రజాస్వామ్యాన్ని మాత్రమే మార్చవద్దని బంగ్లా రాజ్యాంగ సంస్కరణల కమిషన్ తమ నివేదికలో పేర్కొంది. మూల సూత్రాలుగా సమానత్వం, మనుషులకు గౌరవం, సామాజిక న్యాయం, బహువళత్వం, ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదిస్తున్నట్లు ఆ కమిషన్‌ ఛైర్మన్ అలీ రియాజ్ చెప్పారు. 1971లో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ ఆదర్శాలతో పాటు గత ఏడాది జరిగిన తిరుగుబాటు సమయంలో ప్రజలు కోరుకున్న అంశాలను  ప్రతిబింబిస్తూ ఈ ఐదు మూలసూత్రాలను రూపొందించామన్నారు.

Rahul Gandhi : కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది- రాహుల్ గాంధీ కామెంట్స్ పై భగ్గుమన్న బీజేపీ