Rahul Gandhi : కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది- రాహుల్ గాంధీ కామెంట్స్ పై భగ్గుమన్న బీజేపీ
ఢిల్లీలోని ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి.

Rahul Gandhi : బీజేపీతో, రాజ్య వ్యవస్థతో ప్రతిపక్షం పోరాడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు తప్పుపట్టారు. కాంగ్రెస్ అసలు రూపం ఈ వ్యాఖ్యలతో బహిర్గతమైందని బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. దేశంపై ప్రతిపక్షం పోరాడుతోందని చెబుతున్న రాహుల్ గాంధీ.. రాజ్యాంగాన్ని పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.
రాజ్యాంగంపై ప్రమాణం చేసిన విపక్ష నేత దేశంతో పోరాడుతున్నామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలోని ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి.
ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై జేపీ నడ్డా ఎదురుదాడికి దిగారు. భారత్ ను ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందన్నారు. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పపడుతున్నారు. ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సం సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. రాజ్య వ్యవస్థతో ప్రతిపక్షం పోరాడుతోందని రాహుల్ గాంధీ అనడంపై బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు.
కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందన్నారు. దేశాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. దేశంలో రెండు రకాల భావజాలాలు ఉన్నాయని.. ఒకటి రాజ్యంగబద్ధమైన భావజాలం, మరొకటి ఆర్ఎస్ఎస్ భావజాలం అని రాహుల్ గాంధీ అనడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు.
రాజ్యాంగం చెల్లుబాటు కాదని మోహన్ భగవత్ చెబుతున్నారని, బ్రిటీష్ మీద జరిగిన పోరాటాన్ని కూడా ఆర్ఎస్ఎస్ గుర్తించడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. త్రివర్ణ పతాకం, రాజ్యాంగ విలువలపై బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కి నమ్మకం లేదంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఆ ఇద్దరి టార్గెట్ కేజ్రీవాల్..! ఢిల్లీ ఎన్నికల్లో అసలు యుద్ధం ఎవరి మధ్య? ఆసక్తి రేపుతున్న హస్తిన రాజకీయం..