Delhi Politics : ఆ ఇద్దరి టార్గెట్ కేజ్రీవాల్..! ఢిల్లీ ఎన్నికల్లో అసలు యుద్ధం ఎవరి మధ్య? ఆసక్తి రేపుతున్న హస్తిన రాజకీయం..

అక్కడి పాలిటిక్స్ ఇండియా కూటమిలో అలజడి క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరుగుతోంది? ఢిల్లీలో పార్టీల ప్రచారం ఎలా సాగుతోంది?

Delhi Politics : ఆ ఇద్దరి టార్గెట్ కేజ్రీవాల్..! ఢిల్లీ ఎన్నికల్లో అసలు యుద్ధం ఎవరి మధ్య? ఆసక్తి రేపుతున్న హస్తిన రాజకీయం..

Updated On : January 15, 2025 / 6:04 PM IST

Delhi Politics : తూటాలను మించి మాటలు, వేడెక్కిస్తున్న ఆరోపణలు, ఆసక్తి రేపుతున్న విమర్శలు.. ప్రచార వేళ ఢిల్లీ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. రెండు అతిపెద్ద జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్.. వాళ్లలో వాళ్లు ఫైటింగ్ ఆపేసి.. ఆప్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఇదే పరిణామాన్ని చీపురు పార్టీ ఆయుధంగా మార్చుకుంటోంది. దీంతో హస్తిన రాజకీయం మరింత ఆసక్తి రేపుతోంది. అయితే, అక్కడి పాలిటిక్స్ ఇండియా కూటమిలో అలజడి క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరుగుతోంది? ఢిల్లీలో పార్టీల ప్రచారం ఎలా సాగుతోంది?

ఢిల్లీ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు ఏంటి?
ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క.. ఢిల్లీ ఎన్నికల ప్రచారం ఇప్పుడు మూడు పార్టీల నినాదం ఇదే. జాతీయ స్థాయిలో కూటమి అని చెప్పుకుంటున్న ఆప్, కాంగ్రెస్.. ఢిల్లీలో మాత్రం ఎవరికి వారే అంటున్నారు. రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయడం ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ పోల్ లో అసలు యుద్ధం ఎవరి మధ్య ఉండబోతోంది? ఈ ఎన్నికల్లో కీలకం కాబోయే అంశాలు ఏంటి?

Also Read : బ్రిటీష్ వారిపై పోరాటాన్ని గుర్తించడం లేదా..? ఆర్ఎస్ఎస్ చీఫ్‌పై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్

కాంగ్రెస్, ఆప్ విడిగా పోటీ చేస్తే బీజేపీకి లాభమా?
కాంగ్రెస్ తీరుపై ఆప్ నేతలు భగ్గుమంటున్నారు. హర్యానా ఎన్నికల్లో మిత్రపక్షాలకు సీట్ల కేటాయించేందుకు ఒప్పుకోకపోవడంతోనే ఢిల్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోలేదని చెబుతున్నారు. అయితే, ఆప్ ఓట్లను చీల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఢిల్లీలో బీజేపీకి బీ-పార్టీగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ బలంగా పోటీ పడితే అది బీజేపీకే లాభం కలుగుతుందని, 26ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఛాన్స్ ఉంటుందని కమలనాథులు లెక్కలేసుకుంటున్నారు.

బీజేపీ, ఆప్ మధ్యే ప్రధాన యుద్ధం..!
ట్రయాంగిల్ ఫైట్ లో బీజేపీకే లాభమని అంచనా వేస్తున్నారు. అయితే, మూడు పార్టీల మధ్య పోటీ అంటున్నా.. బీజేపీ, ఆప్ మధ్యే యుద్ధం కనిపించే అవకాశాలు ఉన్నాయి. 2020 ఎన్నికల్లో ఆప్ కు 53.57 శాతం, బీజేపీకి 38.5 శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్ కు కేవలం 4.26 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. లోక్ సభ స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేసినా.. అసెంబ్లీ ఫైట్ లో నిలుస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన ఆధిపత్యాన్ని ప్రూవ్ చేసుకునేందుకు సిద్ధమైన ఆప్.. కొత్త పందాలో దూసుకుపోతోంది. లిక్కర్ స్కామ్ ఆరోపణలతో 6 నెలల జైలు జీవితం గడిపిన తర్వాత ఏకంగా సీఎం పదవికి రాజీనామా చేశారు కేజ్రీవాల్. ప్రచార బరిలోకి దిగి విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్ పథకాలతో చేరువయ్యే కొత్త తరహా హామీలతో జనాలను ఆకట్టుకుంటున్నారు.

Also Read : ఈ నెల 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం.. హాజరుకానున్న ముగ్గురు టెక్ దిగ్గజాలు.. ఎవరెవరంటే?