Rahul Gandhi: బ్రిటీష్ వారిపై పోరాటాన్ని గుర్తించడం లేదా..? ఆర్ఎస్ఎస్ చీఫ్‌పై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi: బ్రిటీష్ వారిపై పోరాటాన్ని గుర్తించడం లేదా..? ఆర్ఎస్ఎస్ చీఫ్‌పై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్

Rahul Gandhi

Updated On : January 15, 2025 / 12:07 PM IST

Rahul Gandhi: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని బుధవారం పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రారంభించారు. ఈ నూతన భవనానికి ఇందిరాగాంధీ భవన్ అని పేరు పెట్టారు. కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కతోపాటు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: Arvind Kejriwal: అసెంబ్లీ ఎన్నికలవేళ కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్.. ఢిల్లీ లిక్కర్ కేసు మళ్లీ తెరపైకి..

దేశానికి స్వాతంత్ర్యం 1947లో రాలేదని, రామ్ మందిర్ నిర్మాణం జరిగినప్పుడే వచ్చిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అనడంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రెండు భావజాలాలు ఉన్నాయి. అందులో ఒకటి రాజ్యాంగబద్ధమైన భావజాలం కాంగ్రెస్ పార్టీది. మరొకటి ఆర్ఎస్ఎస్ భావజాలం. మా భావజాలంలో పెద్ద, చిన్న కులాలు, తరతమ బేధాలు ఉండవు. రాజ్యాంగంలో అదే రాసి ఉంది. ఆర్ఎస్ఎస్ లో పూర్తిగా కేంద్రీకృతమైన విధానాలు, నిర్ణయాలు ఉంటాయి. మోహన్ భగవత్ రాజ్యాంగం చెల్లుబాటు కాదని చెబుతున్నారు. బ్రిటీష్ వారి మీద జరిగిన పోరాటాన్ని గుర్తించడం లేదు. వారికి త్రివర్ణ పతాకంపై గౌరవం లేదు. వారికి రాజ్యాంగ విలువలపై నమ్మకం లేదంటూ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అధి కాంగ్రెస్ పార్టీయేనని రాహుల్ అన్నారు.

Also Read: South Korean: తీవ్ర ఉద్రిక్తతల నడుమ దక్షిణ కొరియా అధ్యక్షుడు అరెస్టు.. ఎందుకు అరెస్ట్ చేశారంటే..

కాంగ్రెస్ పార్టీ భావజాలం ఇవాళ్టిదో నిన్నటిదో కాదు. వేల సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని వ్యతిరేకిస్తూ వేల ఏళ్లుగా మా ఐడియాలజీ కొనసాగుతూ వచ్చింది. గురునానక్, గౌతమ బుద్ధుడు, కృష్ణుడు.. వీళ్లంతా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీనా.. అంటూ రాహుల్ ప్రశ్నించారు. ఈ కొత్త భవనం కాంగ్రెస్ భావజాలానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ భవనంలో ఉన్న అందరూ ఆ భావజాలాన్ని కాపాడేవారే. వీరెవరూ బీజేపీకి లొంగిపోయేవారు కాదు. ఈ భవనం బయట మిలియన్ల కొద్దీ ప్రజలు మన భావజాలానికి మద్దతుగా ఉన్నారు. ఈ భావజాలం దేశం నలుమూలలకు మరింతగా విస్తరించాలని రాహుల్ గాంధీ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.