Arvind Kejriwal: అసెంబ్లీ ఎన్నికలవేళ కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్.. ఢిల్లీ లిక్కర్ కేసు మళ్లీ తెరపైకి..

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. 70 శాసనసభ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు మళ్లీ చిక్కులు ఎదురయ్యాయి.

Arvind Kejriwal: అసెంబ్లీ ఎన్నికలవేళ కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్.. ఢిల్లీ లిక్కర్ కేసు మళ్లీ తెరపైకి..

Arvind Kejriwal

Updated On : January 15, 2025 / 10:41 AM IST

Arvind Kejriwal: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. 70 శాసనసభ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే అన్ని నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థులను ప్రకటించారు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు 17వ తేదీతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. దీంతో కేజ్రీవాల్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఇవాళే నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాకిచ్చింది కేంద్ర హోంశాఖ.

Also Read: South Korean: తీవ్ర ఉద్రిక్తతల నడుమ దక్షిణ కొరియా అధ్యక్షుడు అరెస్టు.. ఎందుకు అరెస్ట్ చేశారంటే..

దేశవ్యాప్తంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసు తీవ్రదుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా మనీష్ సిసోడియాలు, సత్యేందర్ జైన్ సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు అరెస్టయ్యి జైలుకెళ్లిన విషయం తెలిసిందే. బెయిల్ మంజూరు కావటంతో వారు బయటకొచ్చారు. గతేడాది మార్చి 21న ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. అనంతరం సీబీఐ కూడా కేసు నమోదు చేసి గతేడాది జూన్ లో కస్టడీలోకి తీసుకుంది. గతేడాది సెప్టెంబర్ నెలలో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన జైలు నుంచి బయటకువచ్చాడు. అంతకుముందే సిసోడియాసైతం మద్యం కుంభకోణం కేసులో జైలుకెళ్లి వచ్చారు. అయితే, కొద్దికాలంగా మద్యం కుంభకోణం కేసు గురించి ప్రస్తావన లేకుండా పోయింది. తాజాగా మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చింది.

Also Read: Rajnath Sing Warning : డాట్..డాట్..డాట్.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..!

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను విచారించేందుకు అనుమతి కోరుతూ గత నెల లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఈడీ లేఖ రాసింది. ప్రజా ప్రతినిధులను విచారించాలంటే ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గతేడాది నవంబర్ నెలలో ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను విచారించేందుకు అనుమతి కావాలని కోరుతూ గవర్నర్ సక్సేనాకు ఈడీ లేఖ రాసింది. దీనికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇదే విషయాన్ని ఈడీ కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లింది.

 

తాజాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాను విచారించేందుకు ఈడీకి కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. తాజా పరిణామం ఢిల్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.