Rajnath Sing Warning : డాట్..డాట్..డాట్.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..!

ఢిల్లీకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తామో.. కశ్మీర్ కు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తామని తెలిపారు.

Rajnath Sing Warning : డాట్..డాట్..డాట్.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..!

Updated On : January 15, 2025 / 12:43 AM IST

Rajnath Sing Warning : పాకిస్తాన్ కు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. పీవోకేలో ఉగ్రవాద చర్యలకు పాల్పడితే ప్రతి చర్యలు తప్పవన్నారు. పీవోకేలో ఉగ్రవాద చర్యలు ఆపాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. లేదంటే డాట్ డాట్ డాట్ అంటూ మ్యూట్ లోనే హెచ్చరికలు జారీ చేశారు.

పీవోకేపై ఆ ప్రాంత ప్రధాని చౌదరి అన్వరుల్ హక్ చేసిన కామెంట్స్ ఖండిస్తూనే.. ఆ దేశానికి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇటు పీవోకే లేకుండా జమ్ముకశ్మీర్ పూర్తి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ము అక్నూర్ సెక్టార్ లోని తండా ఆర్టిలరీ బ్రిగేడ్ లో 9వ సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం జమ్ముకశ్మీర్, సైనికుల కోసం చేసిన కార్యక్రమాలను వివరించారు.

Also Read : రేవంత్ సర్కార్‌కు జనవరి 26 గుబులు..! ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కంగారు ఎందుకు?

ఇదే సందర్భంలో ఢిల్లీకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తామో.. కశ్మీర్ కు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తామని తెలిపారు. ఈ దిశగా పని చేస్తున్నారంటూ ప్రస్తుత సీఎం ఒమర్ అబ్దుల్లాను ప్రశంసించారు. గత ప్రభుత్వాలు కశ్మీర్ ను భిన్నంగా చూశాయని, దీంతో ఈ ప్రాంతంలోని ప్రజలు దేశంతో కలవలేకపోయారని అన్నారు. తమ ప్రభుత్వం కశ్మీర్, దేశంలోని మిగతా ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించడానికి కృషి చేస్తోందని, దాని ఒమర్ అబ్దుల్లా కూడా చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు.

అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని చౌదరి అన్వరుల్ హక్ భారత దేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై రాజ్ నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. పీవోకే లేకుండా జమ్ముకశ్మీర్ సంపూర్ణం కాదని పేర్కొన్నారు. పీవోకే పాకిస్తాన్ కు విదేశీ భూభాగమే తప్ప మరొకటి కాదని తేల్చేశారు. భారత్ లో అస్థిరత్వం తీసుకొచ్చేందుకు పాకిస్తాన్.. పీవోకేలో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. ఆ శిక్షణను, చొరబాట్లను పాకిస్తాన్ వెంటనే ఆపేయాలని, లేదంటే డాట్ డాట్ డాట్ అంటూ ఏమీ చెప్పకుండానే హెచ్చరించారు.

 

Also Read : సీఎం చంద్రబాబుకి తలనొప్పిగా మారిన ఆ ఎమ్మెల్యే ఎవరు? వేటు తప్పదా?