Bar Shooting..9 Dead In Mexico : మెక్సికో బార్‌లో కాల్పులు .. తొమ్మిది మంది మృతి
సెంట్రల్ మెక్సికో రాష్ట్రమైన గ్వానాజువాటోలోని ఓ బార్ లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తొమ్మిదిమంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Bar Shooting 9 Dead In Mexico
Bar Shooting 9 Dead In Mexico : సెంట్రల్ మెక్సికో రాష్ట్రమైన గ్వానాజువాటోలోని ఓ బార్ లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తొమ్మిదిమంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అపాసియోల్ అల్టో పట్టణంలోని బార్‌లోకి బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కొంతమంది ఆయుధాలుతో చొరబడి బార్ లో ఉన్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.
గాయపడిన మహిళల పరిస్ధితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. కాల్పులు జరిపిన దుండగులను ఇంకా గుర్తించలేదని.. ఓ నేరస్తుల గ్రూపునకు సంబంధించిన రెండు పోస్టర్లు ఘటనా స్ధలంలో విడిచివెళ్లారని తెలిపారు. మెక్సికోలో..ఇలా కాల్పులకు పాల్పడిన తరువాత సందేశాలివ్వటానికి ఇలా పోస్టర్లు వదిలి వెళ్లటం జరుగుతుంటుంది. పారిశ్రామిక హబ్‌గా పేరొందిన గునజుటోలో తరచూ గ్యాంగ్ వార్స్ జరుగుతుంటాయి. గత నెలలో ఇరుపుటో సిటీలోని బార్‌లో జరిగిన కాల్పుల్లో 12 మంది మరణించగా సెప్టెంబర్‌లో అదే ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.