Barbie designers: ఘోర రోడ్డు ప్రమాదంలో బార్బీ డిజైనర్లు మారియో పగ్లినో, గియానీ గ్రాస్సీ మృతి
మారియో, జియానీ మృతి పట్ల బార్బీ మాతృసంస్థ మ్యాటెల్ సంతాపం తెలిపింది. వారి మృతి వార్తను బార్బీ టీమ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా నిర్ధారించింది.

Mario Paglino and Gianni Grossi
“బార్బీ” డిజైనర్లు మారియో పాగ్లినో (52), జియానీ గ్రోస్సీ (55) జూలై 27న ఇటలీలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఏ4 టూరిన్ మిలాన్ హైవేపై ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 82 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ వ్యక్తి తన కారు రాంగ్‌రూట్‌లో నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ వృద్ధుడు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందాడు.
బార్బీ టీమ్ నివాళి
మారియో, జియానీ మృతి పట్ల బార్బీ మాతృసంస్థ మ్యాటెల్ సంతాపం తెలిపింది. వారి మృతి వార్తను బార్బీ టీమ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా నిర్ధారించింది. “మారియో, జియానీ.. మిమ్మల్ని మేము మిస్ అవుతున్నాము” అని పేర్కొంది. వారిద్దరు ‘మాజియా2000’గా ప్రపంచానికి బార్బీ ద్వారా ఆనందాన్ని పంచారని చెప్పింది.
‘Magia2000’ అనేది బార్బీ డిజైనర్లు మారియో పగ్లినో, గియానీ గ్రాస్సీ స్థాపించిన ఒక బ్రాండ్ పేరు. ఇటాలియన్‌లో “మాజియా” అంటే ‘మ్యాజిక్’ (Magic) అని అర్థం.
వీరిద్దరి పేర్ల మొదటి అక్షరాలను కలిపి ఈ పేరు పెట్టారు. దీనికి ‘2000’ అనే సంఖ్యను జోడించారు. ఈ బ్రాండ్ కింద వారు హై ఫ్యాషన్, వన్ ఆఫ్ ఏ కైండ్ (ప్రత్యేకమైన) బార్బీ బొమ్మలను తయారు చేసేవారు.
పాగ్లినో, గ్రోస్సీ 1999లో “మాజియా2000″ను స్థాపించారు. ఇది పాప్ కల్చర్, ఆధునిక కళలతో ప్రేరణ పొందిన కస్టమ్ బార్బీ డాల్స్‌కి ప్రత్యేక సంస్థ. వారు రూపొందించిన బార్బీ డాల్స్ లో మడోన్నా, చెర్, విక్టోరియా బెక్‌హామ్, లేడీ గాగా, సారా జెస్సికా పార్కర్కి వంటి డిజైన్లు ఉన్నాయి. వారు బ్రాండ్‌కు చేసిన విశేష కృషికి గుర్తింపుగా 2016లో బార్బీ బెస్ట్ ఫ్రెండ్ అవార్డు అందుకున్నారు.
View this post on Instagram