Short Videos: షార్ట్ వీడియోస్‌‌తో జాగ్రత్త..! నా పిల్లలను అస్సలు చూడనివ్వను.. యూట్యూబ్ కో ఫౌండర్ కీలక వ్యాఖ్యలు..

పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం గురించి హెచ్చరికలు జారీ చేయడంలో ఓపెన్ ఏఐకి చెందిన సామ్ ఆల్ట్‌మన్, ఎలోన్ మస్క్‌ల సరసన చెన్ కూడా చేరారు.

Short Videos: షార్ట్ వీడియోస్‌‌తో జాగ్రత్త..! నా పిల్లలను అస్సలు చూడనివ్వను.. యూట్యూబ్ కో ఫౌండర్ కీలక వ్యాఖ్యలు..

Updated On : August 1, 2025 / 5:16 PM IST

Short Videos: చిన్న పెద్ద తేడా లేదు. ఇప్పుడు అందరూ సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోయారు. షార్ట్స్ వచ్చాక పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పిల్లలు, పెద్దలు అనే డిఫరెన్స్ లేకుండా అంతా వాటికి అడిక్ట్ అయిపోయారు. షార్ట్స్ తెగ చూస్తున్నారు. తిండి తిప్పలు మానేసి మరీ షార్ట్స్ చూస్తూ గడిపేస్తున్నారు. అయితే, ఈ పరిణామం మంచిది కాదంటున్నారు పలువురు నిపుణులు. సోషల్ మీడియా, షార్ట్స్.. పిల్లలపై పెను ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటి కారణంగా పిల్లల్లో అనేక సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. మరీ ముఖ్యంగా పిల్లల్లో శ్రద్ధ, ధ్యాస, ఏకాగ్రత తగ్గిపోతున్నాయని చెబుతున్నారు. తాజాగా షార్ట్ వీడియోస్ గురించి యూట్యూబ్ కో ఫౌండర్ స్టీవ్ చెన్ చేసిన వ్యాఖ్యలు పిల్లలను తమ తల్లిదండ్రులు కాపాడుకోవాల్సిన అవసరాన్ని చాటుతున్నాయి.

సోషల్ మీడియా పిల్లలపై చూపే ప్రభావం గురించి హెచ్చరిక జారీ చేశారు యూట్యూబ్ కో ఫౌండర్ స్టీవ్ చెన్. షార్ట్ వీడియోలతో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు. షార్ట్-ఫామ్ వీడియోలు.. తక్కువ శ్రద్ధ గల వీడియోలకు సమానం అని హెచ్చరించారు. వీటి కారణంగా పిల్లల్లో శ్రద్ధ, ధ్యాస తగ్గుతాయన్నారు. అందుకే, తన సొంత పిల్లలు ఈ రకమైన కంటెంట్‌ను చూడాలని తాను అస్సలు కోరుకోనని ఆయన తేల్చి చెప్పారు. షార్ట్-ఫామ్ వీడియోలు పంపిణీ చేసే కంపెనీలు (యూట్యూబ్ కూడా ఇందులో ఉంది) యువ వినియోగదారుల కోసం భద్రతా చర్యలను జోడించాలని ఆయన సూచించారు.

మన ఆధునిక, కంటెంట్-నిమగ్నమైన ప్రపంచానికి మార్గం సుగమం చేయడంలో సాయపడిన వ్యక్తి YouTube సహ వ్యవస్థాపకుడు స్టీవ్ చెన్. అలాంటి వ్యక్తే.. షార్ట్-ఫామ్ వీడియోలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పిల్లలపై అవి తీవ్రమైన ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. షార్ట్ వీడియోస్ కారణంగా పిల్లల్లో ఏకాగ్రత తగ్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

2006లో గూగుల్ యూట్యూబ్‌ను కొనుగోలు చేయడానికి ముందు దాని మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పని చేసిన స్టీవ్ చెన్, ఈ నెల ప్రారంభంలో స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగిన ప్రసంగంలో ఆన్‌లైన్ జీవితాన్ని టిక్‌టాక్‌గా మార్చడాన్ని వ్యతిరేకించారు. “టిక్‌టాక్ అంటే వినోదం అని నేను అనుకుంటున్నాను. ఇది ఆ క్షణానికే. చిన్న కంటెంట్ అంటే తక్కువ శ్రద్ధ తీసుకునే సమయం” అని చెన్ పేర్కొన్నారు.

చెన్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన పిల్లలు కేవలం షార్ట్-ఫామ్ కంటెంట్‌ను మాత్రమే తీసుకుని, ఆపై 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం చూడకూడదని తాను కోరుకుంటున్నానని చెప్పారు. టిక్‌టాక్ వచ్చిన తర్వాత చాలా కంపెనీలు షార్ట్-ఫామ్ కంటెంట్‌ను అందించడానికి తొందరపడాల్సి వచ్చిందన్నారు చెన్. అయితే ఈ కంపెనీలు ఇప్పుడు డబ్బు సంపాదనతో పాటు వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి ఉపయోగకరమైన కంటెంట్‌తో సమతుల్యం చేసుకోవాల్సి బాధ్యత ఉందన్నారు.

తన మాజీ కంపెనీ యూట్యూబ్‌తో సహా షార్ట్-ఫామ్ వీడియోలను పంపిణీ చేసే కంపెనీలకు కీలక సూచన చేశారు చెన్. షార్ట్-ఫామ్ కంటెంట్‌పై పిల్లల కోసం రక్షణ చర్యలను జోడించాలని విజ్ఞప్తి చేశారు. యాప్‌లకు వయో పరిమితులు పెట్టడంతో పాటు కొంతమంది వినియోగదారులు వాటిని ఉపయోగించగల సమయంపైనా పరిమితులు పెట్టడం శ్రేయస్కరం అని అభిప్రాయపడ్డారు.

పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం గురించి హెచ్చరికలు జారీ చేయడంలో ఓపెన్ ఏఐకి చెందిన సామ్ ఆల్ట్‌మన్, ఎలోన్ మస్క్‌ల సరసన చెన్ కూడా చేరారు. గత వారం ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆల్ట్‌మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా స్క్రోలింగ్, షార్ట్-ఫామ్ వీడియోలు పిల్లల మెదడు అభివృద్ధిని చాలా లోతైన రీతిలో చెడగొట్టడానికి కారణమని పేర్కొన్నారు.

ఎక్స్ యజమాని మస్క్.. 2023లో తన పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై ఎటువంటి పరిమితులు లేవని చెప్పారు. ఆ తర్వాత ఆయన మాట మార్చారు. తాను అలా అనడం పొరపాటు అని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్ మీడియా అలవాట్లలో మరింత చురుకైన పాత్ర పోషించాలని మస్క్ చెప్పారు.

“నేను గతంలో కంటే కొంచెం ఎక్కువగా సోషల్ మీడియాను పరిమితం చేస్తాను. వారు ఏం చూస్తున్నారో గమనిస్తాను. ఎందుకంటే ఈ సమయంలో వారు కొన్ని సోషల్ మీడియా అల్గారిథమ్‌ల ద్వారా ప్రోగ్రామ్ చేయబడుతున్నారని నేను భావిస్తున్నాను. మీరు దాంతో అంగీకరించవచ్చు లేదా అంగీకరించకపోవచ్చు” అని మస్క్ అన్నారు.

Also Read: స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్.. BSNL మైండ్‌ బ్లోయింగ్ ఆఫర్.. రూ.1కే ప్రతిరోజు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌