Joe Biden: సారీ చెప్పను.. అఫ్ఘానిస్తాన్ విషయంలో నేను చేసింది కరెక్టే..: బైడెన్

అఫ్ఘానిస్తాన్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు నానాతంటాలు పడ్డారు. టెర్రరిస్టు దాడులు సైతం ఎదుర్కొన్నారు. వారందరి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. మేం చేసినదానికి క్షమాపణలు చెప్పాల్సిన

Joe Biden: సారీ చెప్పను.. అఫ్ఘానిస్తాన్ విషయంలో నేను చేసింది కరెక్టే..: బైడెన్

Joe Biden

Updated On : January 20, 2022 / 6:46 PM IST

Joe Biden: యూఎస్ ప్రెసిడెంట్ ఆదేశాలనుసారం అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా ఆర్మీ వెనుదిరిగింది. ఈ ప్రభావంతో అక్కడ జరిగిన ఉదంతాలన్నీ మనకు తెలిసినవే. వీటి పట్ల మనకేమీ సంబంధం లేదని.. క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు బైడెన్. అమెరికా అధ్యక్షుడిగా సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఇలా మాట్లాడారు బైడెన్.

అఫ్ఘానిస్తాన్ సంక్షోభం పట్ల సానూభూతి చూపించిన బైడెన్.. ఆగష్టు నెల మధ్యలో 20ఏళ్ల తర్వాత మరోసారి తాలిబాన్లు కంట్రోల్ లోకి తీసుకున్నారు. ఆగష్టు నెల మధ్యలో జరిగిన ఉదంతంపై బైడెన్.. ‘అఫ్ఘానిస్తాన్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు నానాతంటాలు పడ్డారు. టెర్రరిస్టు దాడులు సైతం ఎదుర్కొన్నారు. వారందరి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నాం’

అఫ్ఘానిస్తాన్ లో 20ఏళ్ల పాటు ఉండి తిరిగి రావడం అంత సులువైన పని కాదు. అయినా మేం చేసినదానికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే ఉన్న ప్రతి సమస్యను మేమే పరిష్కరించాలంటే కుదరని పని. సహకరించే వాళ్లు కూడా కనపించలేదు’ బైడెన్ వివరించారు.

ఇది కూడా చదవండి: బీజేపీ ఎమ్మెల్యేని పరుగులు పెట్టించిన గ్రామస్థులు