Elon Musk : ట్విట్టర్ కొత్త ‘సీఈవో’ అంటూ పెంపుడు కుక్క ఫోటోను షేర్ చేసిన ఎలాన్ మస్క్
ట్విట్టర్ కొత్త ‘సీఈవో’ అంటూ పెంపుడు కుక్క ఫోటోను షేర్ చేసారు ఎలాన్ మస్క్.

Billionaire Elon Musk Posts Pic Of "New CEO Of Twitter"
Elon Musk : ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తనదైనశైలిలో వార్తల్లో నిలిచారు. తన పెంపుడు కుక్క ఫ్లోకిని ట్విట్టర్ సీఈఓ కుర్చీలో కూర్చొబెట్టారు. దీనికి సీఈఓ అని రాసి ఉన్న టీ షర్టు కూడా తొడిగారు. ట్విట్టర్ కొత్త సీఈఓ ఇతనే అంటూ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మస్క్ అంటేనే సంచలనాలు అన్నట్లుగా ఉంటారు. అటువంటిది ఆయన ఓ చిన్న పోస్ట్ పెడితేనే క్షణాల్లో వైరల్ అయిపోతుంది.అటువంటిది ఏకంగా పెంపుడు కుక్కకు బ్లాక్ కలర్ షర్టు వేసి..దానికి ‘సీఈఓ’ అని వైట్ కలర్ అక్షరాలతో ఉన్న ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేయటంతో అదికాస్తా తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు ఇదివరకు సీఈఓగా పని చేసిన వ్యక్తి ( భారతీయుడు పరాగ్ అగర్వాల్) కంటే తన కుక్క ఫ్లోకినే మెరుగ్గా పని చేస్తుందంటూ పరోక్షంగా పరాగ్ పై మరోసారి తన దైనశైలిలో సెటైర్ వేశారు. ‘ఇతర సీఈవోల కన్నా ఇదే బెటర్.. నెంబర్లలోనూ, స్టైల్లోనూ’ అంటూ పరోక్షంగా మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్లతో సెటైర్లు వేశారు.
కాగా..న్యాయపోరాటం తర్వాత ట్విట్టర్ ను హ్యాండోవర్ చేసుకున్న మస్క్ అందులో పని చేస్తున్న కీలక వ్యక్తులపై చర్యలు తీసుకుంటూ అగర్వాల్ ట్విట్టర్ లీగల్ హెడ్ విజయ గద్దె, సీఎఫ్ ఓ నెల్ సెగల్ ను తొలగించిన విషయం తెలిసిందే. మస్క్ ట్వీట్లపై వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఓ యూజర్ “అతను మాత్రమే పనిని తీసుకునేంత వెర్రివాడు అని నేను అనుకుంటున్నాను ” అని అన్నారు. మరొకరు నాకు ఈ ఫ్రేమ్ లు బాగా నచ్చాయి వాలెంటైన్ లకు సరిపోతాయని రాసుకొచ్చారు. ఇలా వారి వారి అభిప్రాయాలను రాసుకొచ్చారు. మస్క్ పోస్ట్ చేసిన ఈ ఫోటోపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ ను కుక్క కన్నా హీనం అనే అర్థం వచ్చేలా మస్క్ పెట్టటం సరికాదంటున్నారు.
The new CEO of Twitter is amazing pic.twitter.com/yBqWFUDIQH
— Elon Musk (@elonmusk) February 15, 2023