Bird Flu Human : మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ.. చిలీలో తొలి కేసు నమోదు

చిలీలో బర్డ్ ఫ్లూ (Bird Flu)  వైరస్ కలకలం రేపుతోంది. మనిషిలో (Human) బర్డ్ ఫ్లూ(Bird Flu) లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

Bird Flu Human : మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ.. చిలీలో తొలి కేసు నమోదు

Bird flu

Updated On : March 31, 2023 / 7:23 AM IST

Bird Flu Human : చిలీలో బర్డ్ ఫ్లూ (Bird Flu)  వైరస్ కలకలం రేపుతోంది. మనిషిలో (Human) బర్డ్ ఫ్లూ(Bird Flu) లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. చిలీలో(Chile) తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు అయింది. దేశ ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. 53 ఏళ్ల వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు తెలిపింది. ఆ రోగికి తీవ్రమైన ఇన్ ఫ్లూ ఎంజా లక్షణాలు ఉన్నట్లు పేర్కొంది. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించింది. దేశంలో తొలిసారి మనిషికి బర్డ్ ప్లూ వైరస్ ఎలా వ్యాపించిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.

ఈ వైరస్ పక్షులు లేదా సముద్రపు క్షీరదాల నుంచి మనుషులకు వ్యాపించి ఉంటుందని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే మనుషుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపించడం ఇప్పటివరకు గుర్తించ లేదని చెప్పారు. బర్డ్ ఫ్లూ సోకిన రోగితో కాంటాక్ట్ అయిన వ్యక్తులను కూడా ట్రాక్ చేస్తున్నట్లు చిలీ ప్రభుత్వం పేర్కొంది. గతేడాది చివరిలో అటవీ జంతువుల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్లు తెలిపింది.

First Bird Flu Death : దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం, 11ఏళ్ల బాలుడు మృతి

దీంతో పౌల్ట్రీ ఎగుమతులను నిలిపివేసినట్లు పేర్కొంది. మరోవైపు అర్జెంటీనా సహా 14 లాటిన్ అమెరికా దేశాలలో కూడా మనుషుల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అయ్యాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈక్వెడార్ కు చెందిన బాలిక(9)లో మానవ సంక్రమణ బర్డ్ ఫ్లూ కేసును నిర్ధారించారు. అయితే మనుషులకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకడం తీవ్ర కలవర పెడుతోంది.