ఎగరటం దండగ విమానం ఉండగా : బిజినెస్ క్లాస్ లో బర్డ్ జర్నీ  

ఎగరటం ఎందుకు దండగ  విమానం ఉండగా అనుకుందో ఏమో దర్జాగా బిజినెస్ క్లాస్ లోకి ఎక్కి  సింగపూర్ నుండి లండన్ కు ప్రయాణించింది ఓ పక్షి. 

  • Published By: veegamteam ,Published On : January 16, 2019 / 03:39 AM IST
ఎగరటం దండగ విమానం ఉండగా :  బిజినెస్ క్లాస్ లో బర్డ్ జర్నీ   

ఎగరటం ఎందుకు దండగ  విమానం ఉండగా అనుకుందో ఏమో దర్జాగా బిజినెస్ క్లాస్ లోకి ఎక్కి  సింగపూర్ నుండి లండన్ కు ప్రయాణించింది ఓ పక్షి. 

సింగపూర్ : ఎగరటం ఎందుకు దండగ  విమానం ఉండగా అనుకుందో ఏమో దర్జాగా బిజినెస్ క్లాస్ లోకి ఎక్కి  సింగపూర్ నుండి లండన్ కు ప్రయాణించింది ఓ పక్షి.  ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పక్షుల్లా గాల్లో ఎగిరిపోవాలనే మనిషి కల విమానం తయారీకి కారణమంటారు. గాల్లో కులాసాగా ఎగిపోతు..చక్కర్లు కొట్టే పక్షి విమానం ఎక్కి దర్జాగా ప్రయాణించటం చూశారా..పోనీ విన్నామా? అయితే ఇప్పుడు చూద్దాం.. విమానం ప్రయాణం అంటే కాస్తంత ఖర్చు ఎక్కువే. ఇక బిజినెస్ క్లాసులో వెళ్లాలంటే ఇంకాస్త ఎక్కువ డబ్బులు పెట్టాల్సిందే. కానీ ఓ పక్షిరాజం మాత్రం రూపాయి ఖర్చు లేకుండా దర్జాగా ఫ్రీగా బిజినెస్ క్లాసులో సింగపూర్ నుండి లండన్ కు ప్రయాణం చేసింది. 

సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో జనవరి 7న సింగపూర్ నుంచి లండన్ వరకూ 14 గంటల చాటు దర్జాగా బిజినెస్ క్లాస్ లో కూర్చుని వెళ్లిపోయింది. ఆ పక్షి విమానంలోకి ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలియదుగానీ..ఎగిరే పనిలేకుండా దేశాలు దాటింది. దీనిపై సింగపూర్ ఎయిర్ లైన్స్ అధికారులు సైతం దీనిపై స్పందిస్తు..ఆ పక్షి లోపలికి ఎలా వచ్చిందో తెలియదన్నారు. విమానం లండన్ చేరగానే కష్టపడి దాన్ని పట్టుకుని.. లండన్ జూ అధికారులకు అప్పగించామని తెలిపారు. ఇక పక్షిని విమానంలో చూసిన పలువురు దాన్ని వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియా వైరల్ గా మారింది.