Amazon Dolphins : అమెజాన్ అడవుల్లో 100కు పైగా డాల్ఫిన్లు మృతి, ఆందోళనలో శాస్త్రవేత్తలు

ఏడాది పొడవునా వర్షం కురిసే ఈ ప్రాంతం .. ప్రపంచానికి 20శాతానికి పైగా ఆక్సిజన్ అందించే అమెజాన్ అడవులు ఎండిపోతున్నాయి. దీంతో అడువుల్లో జీవిస్తున్న ఎన్నో రకాల అరుదైన జాతులకు మృత్యుకేళిగా మారుతోంది. వర్షం తగ్గిపోవటం వేడి పెరుగటంతో అరుదైన జీవులు చనిపోతున్నాయి.

Amazon Dolphins : అమెజాన్ అడవుల్లో 100కు పైగా డాల్ఫిన్లు మృతి, ఆందోళనలో శాస్త్రవేత్తలు

Amazon Dolphins in  brazil

Amazon Dolphins in  brazil : ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్‌ ఇచ్చే ప్రాంతం, పచ్చని ప్రకృతికి, వింత వింత జీవులకు ఆలవాలమైన ప్రాతం, సమస్త జీవరాశికి జీవనాడి ఇదే అయిన ప్రపంచంలోనే అత్యద్భుతమైన అడవీప్రాంతం అమెజాన్. తొమ్మిది దేశాలకు విస్తరించిన అపారమైన అరుదైన..అద్భుతమైన వృక్షజాతులకు నిలయం అమెజాన్ అడవులు. ప్రపంచంలోనే అతి పెద్ద అత్యంత అటవీ ప్రాంతం అమెజాన్ అడవులు. దక్షిణ అమెరికాలో తొమ్మిది దేశాలకు విస్తరించిన అడవులు ఇవి. ఈ ప్రపంచానికి ఊపిరితిత్తులుగా అభివర్ణిస్తుంటారు అమెజాన్అడువల్ని. ఎందుకంటే ప్రపంచానికి కావాల్సిన 20 శాతం ఆక్సిజన్ ఈ అడవుల నుంచే లభిస్తోందట. లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన చిత్తడి నేల..అత్యంత అరుదైన..అరుదైన తెగలకు ఆలవాలం అమెజాన్ అడవులు.

ఏడాది పొడవునా వర్షం కురిసే ఈ ప్రాంతం పచ్చని ప్రకృతికి నిలువెత్తు నిదర్శనం. అటువంటి అమెజాన్ అడవుల్లో వేల రకాల జీవులు నివసిస్తున్నాయి. ఎన్నో అరుదైన అద్భుతమైన జీవులు నివసించే ప్రాంతం. అటువంటి అమెజాన్ అడవుల్లో ముద్దులొలికే డాల్ఫిన్లకు మృత్యుకేళిగా మారింది. 100కుపైగా డాల్ఫిన్లు చనిపోయాయి. కారణం అమెజాన్ అడవుల్లో ఉష్ణోగ్రతలు పెరగటమే కారణమని సైంటిస్టులు తెలిపారు. పెరుగుతున్న నీటి ఉష్ణోగ్రతల వల్ల ఏడు రోజులుగా డాల్ఫిన్ల మరణఘోష వినిపిస్తోంది. 100కుపైగా డాల్ఫిన్లు మృత్యువాత పడ్డాయి. బ్రిజిల్ లో విస్తరించిన అమెజాన్ అడువుల్లో 100 నుంచి 102 ఫారెన్‌హీట్‌గా అక్కడి టెంపరేచర్ నమోదవుతోంది.

Birds Strange Nest : ఆ పక్షుల గూళ్లకు 200 ఏళ్ల చరిత్ర,ఆ గ్రామంలో ఆ ఇల్లంటే వాటికి ఎందుకంత ఇష్టం..?

బ్రెజిల్‌లో 60 శాతం మేర అమెజాన్ అడవులు విస్తరించి ఉన్నాయి..ఈ అడవుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుంటంతో డాల్ఫిన్లు మృత్యువాత పడుతున్నాయి. సాధారణంగా ఇక్కడ ఉష్ణోగ్రతలు గరిష్ట 25 డిగ్రీలు. సగటు ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీల వరకు ఉంటుంది. అటువంటిది ఉష్ణోగ్రత రికార్డుస్థాయికి చేరుకోవటంతో కొద్దిరోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 39 డిగ్రీల పైమాటగానే ఉంది. 100 నుంచి 102 ఫారెన్‌హీట్‌గా టెంపరేచర్ ఉంటోంది. దీంతో అనేక జీవజాలానికి మరణశాసనంలా మారింది. ప్రత్యేకించి డాల్ఫిన్లు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయి. వారం రోజుల్లో వందకు పైగా డాల్ఫిన్లు మరణించటం ఆందోళనకరంగా మారింది.

ప్రపంచంలోనే అతి పెద్ద జలమార్గం అమెజాన్ నది. ఈ నదుల్లో ఎన్నో జలచరాలు జీవిస్తున్నాయి. వీటిలో డాల్ఫిన్లు కూడా ఉన్నాయి. అమెజాన్‌ నదీ తీరంలో ఉన్న లేక్ టెఫెలో డాల్ఫిన్ల మృతదేహాలు కొట్టుకు వస్తున్నాయి. దీనిపై బ్రెజిల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనికోసం ప్రత్యేకంగా మమిరువా ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.100కు పైగా డాల్ఫిన్ల మరణానికి వాతావరణ మార్పులే కారణమని శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది. గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డుస్థాయి ఉష్ణోగ్రత నమోదు కావడం అటు కరవుకు దారి తీసే ప్రమాదం ఉందని అంచనా వేసింది.

దీంతో మిగిలిన డాల్ఫిన్లను సంరక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది బ్రెజిల్ ప్రభుత్వం. వర్షంపాత్రం తక్కువ కావటం వల్ల అమెజాన్ నదీ తీరం చాలావరకు ఎండిపోయిందని సైంటిస్టుల బృందం ధృవీకరించింది. దీంతో ఆ ప్రాంతాల్లోని కొన్ని అరుదైన మొక్కలు సైతం ఎండిపోతున్నాయని పేర్కొంది. ఇటువంటి పరిస్థితి కొనసాగితే మరింత నష్టం చూడాల్సి వస్తుందని మమిరువా ఇన్‌స్టిట్యూట్ రీసెర్చర్ ఆండ్రీ క్యోల్హో అభిప్రాయపడ్డారు. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల బ్రెజిల్‌లోని అమెజాన్ లోని ప్రాంతాల్లో కరవు ఛాయలు కనిపిస్తున్నాయి. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా 59 మున్సిపాలిటీల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. ఈ పరిస్థితి నదిపై నీటి రవాణా, అలాగే చేపల వేట వంటి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితులు అమెజాన్ ఆర్థిక వ్యవస్థపై కూడా పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Kerala High Court : పాపకు పేరు పెట్టటానికి కోర్టుకెక్కిన భార్యాభర్తలు, చిన్నారికి న్యాయమూర్తే నామకరణం చేసిన వైనం

కాగా అమెజాన్ అడవులు తొమ్మిది దేశాల సరిహద్దులో విస్తరించి ఉన్నాయి. బ్రెజిల్, బొలీవియా, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, వెనిజులా, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా ఉన్నాయి. ఈ అడవి 60 శాతం బ్రెజిల్‌లోనే ఉంది. పెరులో 13 శాతం, కొలంబియాల 10 శాతం మేర విస్తరించి ఉన్నాయి. ఈ అడవులు నుంచి ప్రపంచానికి 20 నుంచి 30 శాతం మేర ఆక్సిజన్ ఇక్కడి అందుతుందనేది సైంటిస్టుల చెబుతుంటారు.