Kerala High Court : పాపకు పేరు పెట్టటానికి కోర్టుకెక్కిన భార్యాభర్తలు, చిన్నారికి న్యాయమూర్తే నామకరణం చేసిన వైనం

ఓ జంట తన బిడ్డకు పేరు పెట్టే విషయంలో జరిగిన గొడవ ఏకంగా కోర్టెకెక్కింది. తాను నిర్ణయించిన పేరే పెట్టాలని గొడవ పడ్డారు. దీంతో న్యాయమూర్తి రంగంలోకి దిగారు. సమస్యను చక్కగా పరిష్కరించారు.

Kerala High Court : పాపకు పేరు పెట్టటానికి కోర్టుకెక్కిన భార్యాభర్తలు, చిన్నారికి న్యాయమూర్తే నామకరణం చేసిన వైనం

Kerala High Court

Kerala High Court .. Child Named : పుట్టిన బిడ్డకు మంచి పేరు పెట్టాలని భార్యభర్తలు ఎంతగానో తపన పడతారు. పేరులో చక్కటి అర్థం ఉండాలని..అది కూడా కొత్తగా ఉండాలని ఆకాంక్షిస్తారు. బిడ్డ పుట్టకముందునుంచే ఏ పేరు పెట్టాలి…? అనే యత్నాలు మొదలుపెడతారు. మగ బిడ్డ పుడితే ఏ పేరు పెట్టాలి..? ఆడబిడ్డ పుడితే ఏం పేరు పెట్టాలని ఎంతో ఆలోచిస్తారు. దాని కోసం స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషుల సలహాలు తీసుకుంటుంటారు. ఇంటర్ నెట్ లో కూడా వెదికేస్తారు. బిడ్డలకు పేరు పెట్టే విషయంలో ఎంతో రీసెర్చ్ లు చేసేస్తుంటారు. పూర్వం అంటే పెద్దవాళ్ల పేర్లు పెట్టేవారు. కానీ ఈరోజులో పెట్టే పేరు ట్రెండ్లీగా ఉండాలి..చక్కటి మీనింగ్ ఉండాలని అనుకుంటున్నారు. దీంతో చిన్నారులకు పేర్లు పెట్టే విషయంలో కసరత్తులు చేసేస్తుంటారు.

ఇదిలా ఉంటే కేరళలో ఓ జంట తన బిడ్డకు పేరు పెట్టే విషయంలో జరిగిన గొడవ ఏకంగా కోర్టెకెక్కింది.  ఇద్దరు చెరో పేరు నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో భార్యకు నెలలు నిండాయి.. 2020 ఫిబ్రవరిలో  బిడ్డ పుట్టింది. తరువాత తాను నిర్ణయించిన పేరు పెట్టాలంటే కాదు నేను నిర్ణయించిన పేరు పెట్టాలని భార్యాభర్తల ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఆ గొడవ కాస్తా..పెద్దదైంది. ఇద్దరు విడిపోయే స్థాయికి వెళ్లింది. దీంతో భార్య బిడ్డను తీసుకుని వేరుగా ఉంటోంది. పాపకు మూడేళ్లు వచ్చాయి. కానీ పేరు పెట్టలేదు. భార్యాభర్తలు ఇద్దరు కలవలేదు.

Gujarat : జెయింట్ వీల్ ఎక్కుతున్నారా? మీ హెయిర్ లూజ్‌గా వదిలేసారో.. అంతే ! ఏమవుతుందో ఈ స్టోరీ చదవండి

భార్యాభర్తలు వేర్వేరుగా ఉండటంతో చిన్నారికి జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్‌లో పేరు లేకపోవడంతో.. ఓ పేరు నమోదు చేసేందుకు తల్లి ప్రయత్నించింది. దాన్ని భర్త అడ్డుకున్నాడు. గొడవ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో పాపకు పేరు నమోదుచేయాలంటే తల్లిదండ్రులిద్దరూ హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు. భార్య ‘పుణ్య నాయర్’ అనే పేరు పెట్టాలని పట్టుబట్టింది. అలా కుదరదు ‘పద్మ నాయర్’అనే పేరు పెట్టాలని భర్త పట్టుబట్టాడు. ఇధ్దరు ఏమాత్రం తగ్గలేదు. దీంతో పాప తల్లి కేరళ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్‌ కురియన్‌ థామస్‌ కోర్టు అధికార పరిధిని ఉపయోగించుకుని ఈ సమస్యను చక్కగా పరిష్కరించారు. తల్లి సూచించిన పేరుతోపాటు తండ్రి పేరునూ జత చేసి, పాపకు ఓ పేరు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే సమయంలో ఆ తల్లిదండ్రుల మధ్య గొడవలు పరిష్కారం అవ్వటానికి కాస్త సమయం పడుతుందని ఆ ప్రభావం బిడ్డ పేరు పెట్టే విషయంలో పడకూడదని అభిప్రాయపడిన న్యాయమూర్తి బిడ్డకు పేరు లేకపోతే పిల్లల ప్రయోజనాలకు అనుకూలంగా ఉండదని సూచించారు.

Viral Video : ప్రేమ కాదు.. పిచ్చికి పరాకాష్ట.. గాళ్ ఫ్రెండ్ చేయి కొరికిన చోట అతనేం చేసాడో చూడండి

‘కోర్టు అధికార పరిధిని అమలు చేయడంలో తల్లిదండ్రుల హక్కులు కాకుండా పిల్లల సంక్షేమమే ప్రధానమైందని వ్యాఖ్యానించారు. పిల్లల కోసం పేరును ఎంపిక చేసే పనిని కోర్టు నిర్వహించాలి. పేరు విషయంలో పిల్లల సంక్షేమం, సాంస్కృతిక పరిగణనలు, తల్లిదండ్రుల ఆసక్తులు, సామాజిక నిబంధనలు వంటి అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకోవచ్చని, పిల్లల శ్రేయస్సు అంతిమ లక్ష్యం అని అన్నారు. కోర్టు మొత్తం పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పేరును స్వీకరించాలన్నారు. ఈ విషయంలో కోర్టు తన అధికార పరిధిని ఉపయోగించవలసి వచ్చింది’ అంటూ వ్యాఖ్యానించారు. పాపకు తల్లిదండ్రులు పేర్లు కలిసొచ్చేలా ‘పుణ్య బాలగంగాధరన్ నాయర్’ అనే పేరు పెట్టారు న్యాయమూర్తి. కాగా కోర్టులో ఇదొక ఆసక్తికర పరిణామ అని చెప్పొచ్చు.