Birds Strange Nest : ఆ పక్షుల గూళ్లకు 200 ఏళ్ల చరిత్ర,ఆ గ్రామంలో ఆ ఇల్లంటే వాటికి ఎందుకంత ఇష్టం..?

ఆ గ్రామంలో ఓ జాతికి చెందిన పక్షులు నిర్మించుకునే గూళ్లకు ప్రసిద్ధి చెందింది. ప్రతీ ఏటా ఆ గ్రామంలో ఉండే ఒకే ఇంటి కింద తమ గూళ్లను నిర్మించుకోవటం ఆ గ్రామానికి ఓ ప్రత్యేకతగా నిలుస్తోంది. అంతేకాదు ఈ గూళ్లను చూడానికి పర్యాటకు రావటం మరో విశేషం.

Birds Strange Nest : ఆ పక్షుల గూళ్లకు 200 ఏళ్ల చరిత్ర,ఆ గ్రామంలో ఆ ఇల్లంటే వాటికి ఎందుకంత ఇష్టం..?

Unique Mud Nests of Birds

200 Years History Unique Mud Nests in Rajasthan village : పక్షులు గడ్డిపరకలు, పుల్లలు వంటివాటితో గూళ్లు కట్టుకుంటాయి. రకరకాల పక్షులు కట్టుకునే రకరకాల గూళ్లు మనుషులకు ఎప్పుడు వింతగాను..అబ్భురంగాను ఉంటుంది.మరీ ముఖ్యంగా పిచ్చికు గూళ్లను చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. చెట్లకు వేలాడే పిచ్చుక గూళ్లు ఎంత గాలి వాన వచ్చినా ఏమాత్రం చెక్కుచెదరవు. గాలికి వేలాడుతు పడిపోతుందనే అనిపిస్తుంది గానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పీచు, గడ్డిపరకలు వంటిని ఎక్కడెక్కడి నుంచో ఏరి తెచ్చుకుని గూళ్లు కట్టుకుంటాయి పిచ్చుకలు. వాటి గూళ్లు చాలా బలంగా ఉంటాయి. ఎంత గాలి వాన వచ్చినా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి.

ఎన్నో రకాల పక్షులు వాటి వాటి స్టైల్లో గూళ్లు కట్టుకుంటుంటాయి. దేని స్టైల్ దానిదే. కొన్ని పక్షులు మట్టితో కూడా గూళ్లు నిర్మించుకుంటాయి. సాధారణంగా పక్షులు పుల్లలు,గడ్డిపరకలతోనే గూళ్లు నిర్మించుకుంటాయి. పక్షులు తమకు నచ్చి చెట్టుమీదనో..లేదా ఇంటిమీదనో గూళ్లు కట్టుకుంటాయి. ఆ గూడు సేఫ్టీ ప్లేసులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాయి. కానీ ఓ జాతికి చెందిన పక్షులు మట్టితో కూడా గూళ్లు నిర్మించుకుంటాయనే విషయం తెలుసా..?పైగా ఆ పక్షులు అన్నీ ఒకేచోట వింత వింత ఆకారంలో గుంపులు గుంపులుగా చేరి గూళ్లు నిర్మించుకుంటుఉంటాయి. పైగా ఓ గ్రామంలో ఓ జాతకి చెందిన పక్షులు గుంపులు గుంపులుగా ఒకేచోట గూళ్లు నిర్మించుకోవటమే కాదు ప్రతీ ఏటా ఒకే ఇంటి కింద..గూళ్లు నిర్మించుకోవటం విశేషంగా మారింది.

Kerala High Court : పాపకు పేరు పెట్టటానికి కోర్టుకెక్కిన భార్యాభర్తలు, చిన్నారికి న్యాయమూర్తే నామకరణం చేసిన వైనం

రాజస్థాన్‌ బన్‌స్వారా జిల్లాలోని బగిదోరా ప్రాంతంలో నౌగామా అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి దేశవిదేశాలనుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. గ్రామంలో ఉన్న జైనధర్మశాలలో కోయిల తరహా పక్షులు కట్టుకునే గూళ్లను చూసేందుకు పర్యాటకులు వస్తారు. ఇంటి గోడ కింది భాగంలో గూళ్లు కట్టుకుంటాయి పక్షులు. ఈ పక్షులు ఓ జాతికి చెందిన కోయిలను అని చెబుతున్నారు. సాధారణంగా కోయిలలు గూళ్లు నిర్మించుకోవు.ఏదోక పక్షి గూటిలో తమ గుడ్లను పెడుతుంటాయి.

కానీ నౌగామా గ్రామంలో మాత్రం కోయిల జాతికి చెందిన పక్షులు ప్రతీ ఏటా ఆ గ్రామంలో ఉండే ఒకే ఇంటి కింద తమ గూళ్లను నిర్మించుకోవటం ఆ గ్రామానికి ఓ ప్రత్యేకతగా నిలుస్తోంది. అంతేకాదు ఈ గూళ్లను చూడానికి పర్యాటకు రావటం మరో విశేషం. ఈ పక్షులు ఎక్కడెక్కడి నుంచో మట్టి తెచ్చుకుని ఒక క్రమపద్ధతిలో ఎవరో డిజైన్ చేసినట్టుగా ఎక్కడా వరుస తప్పకుండా…అద్భుత రీతిలో ఒకదాని వెంట ఒకటి గూళ్లు నిర్మించుకుంటాయి. అయితే ఎంతో కష్టపడి ఈ కోయిలలు నిర్మించుకున్న ఇళ్లు వర్షాకాలంలో కరిగిపోతాయి. కానీ వెంటనే ఈ పక్షులు వేగంగా వాటిని తిరిగి నిర్మిస్తాయి. పగలంతా ఎక్కడెక్కడో తిరిగి ఆహారం సంపాదించుకుని తిని..సాయంసంధ్య వేళలో ఒకదానితోఒకటి కలిసి ఆ పక్షులు గాల్లో ఎగురుతూ గూళ్ల దగ్గరకి వచ్చే దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుందోనని పరవశించిపోతుంటారు పర్యాటకులతో పాటు స్థానికులు కూడా.

Kerala : గూగుల్ మ్యాప్ అనుసరించి డ్రైవింగ్.. కేరళ పెరియార్ నదిలో కారు పడి, ఇద్దరు వైద్యులు మృతి

ఇలా పక్షులు ఇక్కడ గూళ్లు కట్టుకుని స్థిర నివాసం ఏర్పచుకోవటం వెనుక వందల ఏళ్ల చరిత్ర ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది. 200 ఏళ్ల నుంచి ఈ పక్షులు ఇక్కడే ఇలా గూళ్లు కట్టుకుంటున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పక్షులు గూళ్లు కట్టుకునే ఆ ఇంటిని ఒకసారి మొత్తం కూల్చివేసి అదే స్థలంలో మరో కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు నిర్మించిన వెంటనే పక్షులన్నీ మళ్లీ వచ్చి..అవి కూడా తిరిగి గూళ్లు కట్టుకున్నాయి. ఎన్నిసార్లు ఆ గూళ్లను తొలగించివేసినా..పక్షులు మళ్లీ మళ్లీ నిర్మించుకుంటూనే ఉన్నాయి. తాము గూళ్లు కట్టుకునే ఆ ఇంటిని పక్షులు అస్సలు మర్చిపోవని స్థానికులు అంటున్నారు. ఈ పక్షులు తమ గ్రామంలో ఉండడంతో తమకెంతో గర్వంగా ఉంటుందని చెబుతుంటారు.