ఫ్రెండ్స్ అంటూ కలుస్తున్నారు.. కరోనాను పెంచుతున్నారు

ఫ్రెండ్స్ అంటూ కలుస్తున్నారు.. కరోనాను పెంచుతున్నారు

Updated On : August 3, 2020 / 2:48 PM IST

ఫ్యామిలీ గ్రూపుల మధ్య అతిగా తిరుగుతుండటమే ఇన్ఫెక్షన్లు అతిగా పెరగడటానికి కారణమని సైంటిఫిక్ అడ్వైజర్లు చెబుతున్నారు. కరోనా వ్యాప్తి రెండో దశ ఆల్రెడీ మొదలవడంతో.. కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం అన్ లాకింగ్ ప్రోసెస్ ఎత్తేయడంతో ఇన్ఫెక్షన్ తగ్గడానికి బదులు రివర్స్ అయింది.



నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్ ఏరియాలో విస్తృతంగా కరోనా వ్యాపించింది. ఈ నేఫథ్యంలో రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు 30మందికి మించి అనుమతించకూడదని ప్లాన్ చేశారు. అందిన సమాచారం ప్రకారం.. రెండో నేషనల్ లాక్‌డౌన్.. అమలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.



ఇన్ఫెక్షన్ పెరగడానికి పెద్ద కారణం.. ప్రజలు ప్రదేశాలకు వెళ్లడం లేదా బయటివారు ఇళ్లకు రావడమే. ఇంకొక ఆప్షన్ ఏమంటే జబ్బు పడ్డామని తెలిసి కూడా ఇంట్లో ఉండకుండా బయటతిరగడమే. దాంతోపాటుగా స్కూల్స్ రీఓపెన్ చేయడం కూడా ప్రమాదకరంగానే ఉంది. ఎడ్యుకేషన్ సెక్రటరీ.. గ్యావిన్ విలియమ్సన్ చెప్పినదాని ప్రకారం.. వచ్చే నెల వరకూ స్కూళ్ల నిండా జనాలు పెరిగిపోతారని.. దీని కారణంగా నేరాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.