నీటి దుర్వినియోగం కేసులో పర్యావరణ మంత్రికి 8ఏళ్ల జైలు!

నీటి సరఫరాను ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేసినట్లు బల్గేరియన్ పర్యావరణ మరియు నీటి శాఖ మంత్రి నేనో డిమోవ్ పై అభియోగాలు మోపినట్లు ప్రాసిక్యూటర్లు శుక్రవారం(జనవరి-20,2019) తెలిపారు. నీటి సరఫరా దుర్వినియోగం కేసులో గురువారం ఆయనను పోలీసులు 24గంటల కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. రాజధాని సోఫియాలో పోలీస్ సెల్ లో ఆయన గురువారం రాత్రి ఉంచారు.
70వేల కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న నగరమైన పెర్నిక్ ప్రజలకు తాగునీరు ఆధారం ఒకే ఒక్క డ్యామ్ అని అధికారులు సమాచారమందిచినప్పటికీ డిమోవ్ ఉద్దేశ్యపూర్వకంగా పారిశ్రామిక వినియోగదారులకు నీటి సరఫరాను అనుమతించినందుకు కారణంగా డిమోవ్ ఎనిమిది సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. 70,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న పెర్నిక్ అనే పట్టణం సుమారు రెండు నెలలుగా తీవ్రమైన,నిరంతర నీటి ఆంక్షలకు లోబడి ఉంది. ఈ విషయం అనేక సంస్థల దర్యాప్తులో ఉంది.
పెర్నిక్‌లో నీటి సరఫరా సమస్యలకు దారితీసిన అధికారుల నేరాలకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నట్లు ప్రాసిక్యూటర్స్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. చీప్ ప్రాసిక్యూటర్ ఇవాన్ గీషెవ్ గురువారం నగరంలో పర్యటించారని తెలిపింది. మరోవైపు ఇవాళ ఉదయం డిమోవ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే వెంటనే ప్రధానమంత్రి బోరిసోవ్ డిమోవ్ రాజీనామాను ఆమోదించారు.