Cable Car : కేబుల్ కారులో స్కూల్‌కు వెళుతున్న విద్యార్ధులు, 1200ల అడుగుల ఎత్తులో సడెన్‌గా తెగిపోయిన కేబుల్
విద్యార్ధులు స్కూలుకు వెళ్లాలంటే కేబుల్ కారే ఆధారం. కింద లోయ..;పైన 1200 అడుగుల ఎత్తులో కేబుల్ కారులో ప్రయాణిస్తుండగా సడెన్ గా కారు కేబుల్ తెగిపోయింది. దీంతో స్కూల్ పిల్లలంతా కారులో చిక్కుకుపోయారు.

Cable car cable snaps in Pakistan
Pakisthan : విద్యార్ధులు స్కూలుకు వెళ్లాలంటే కేబుల్ కారే ఆధారం. కింద లోయ..1200 అడుగుల ఎత్తులో కేబుల్ కారు(cable car)లో ప్రయాణం. అలాగే రోజు స్కూల్ కు వెళుతుంటారు. రోజులాగానే మంగళవారం (ఆగస్టు 22,2023)న కూడా ఎనిమిదిమంది కేబుల్ కారులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా కారు కేబుల్ తెగిపోయింది. పిల్లలంతా హాహా కారాలు చేశారు. పాపం భయంతో వణికిపోయారు. ఇక తమ ప్రాణాలు పోతాయని అల్లాడిపోయారు. అలా 1200ల అడుగుల ఎత్తులో తెగిపోయిన కారులో ఎనిమిదిమంది మంది చిక్కుకుపోయిన ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది.
పాకిస్థాన్(Pakistan)లో కొండలు, లోయలతో కూడిన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో మంగళవారం లోయలను దాటేందుకు వినియోగించే ఓ కేబుల్ కారు వైర్లు ప్రయాణం మధ్యలో సడెన్ గా తెగిపోయాయి. దీంతో ఆరుగురు విద్యార్ధులతో పాటు మరో ఇద్దరు యువకులు నేలకు 1200 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు. వారిని రక్షించటానికి పాకిస్థాన్ ఆర్మీ రంగంలోకి దిగింది. అలా దాదాపు 14గంటలు తీవ్రంగా శ్రమించి ఎనిమిదిమందిని ప్రాణాలతో రక్షించింది. కానీ కేబుల్ తెగిపోయిన ఆకారులో 1200ల అడుగుల ఎత్తులో ఐదు గంటల పాటు చిక్కకుపోవటంతో బాధితుల్లో ఒకరు భయంతో స్పృహ తప్ప పడిపోయారని వారు బయటపడిన తరువాత తెలిపారు.
Chandrayaan-3 Mission : చంద్రయాన్ మిషన్‌కు పాక్ మాజీ మంత్రి ప్రశంసలు
ప్రైవేటు వ్యక్తులు ఈ కేబుల్ కారు నడుపుతున్నారు. మంగళవారం ఉదయం 7.00 గంటలకు ప్రయాణం ప్రారంభించిన కాసేపటికే కేబుల్ తెగిపోయింది. బట్టగ్రాం జిల్లాలోని అల్లాయి తహసీల్ పరిధిలో విద్యార్థులు స్కూలుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఆర్మీ బృందాలను, అధికారులను పాక్ ఆపద్ధర్మ ప్రధానమంత్రి అన్వరుల్ హఖ్ కాకర్ అభినందించారు.