Canada accident : కెనడాలో వ్యాన్ ను ఢీకొన్ని ట్రాక్టర్.. ఐదుగురు భారతీయ విద్యార్థుల మృతి

కెనడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందిన ఘటన టొరంటో సమీపంలో సంభవించింది.

Canada accident : కెనడాలో వ్యాన్ ను ఢీకొన్ని ట్రాక్టర్.. ఐదుగురు భారతీయ విద్యార్థుల మృతి

5 Indian Students Died In Canada Accident

Updated On : March 14, 2022 / 10:43 AM IST

5 Indian students died in Canada accident : కెనడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందిన ఘటన టొరంటో సమీపంలో సంభవించింది. ఆంటారియో బెల్లెవిల్లే సమీపంలో 401 హైవేపై ప్రమాదం సంభవించింది. మృతులు ప్యాసింజర్ వ్యానులో ప్రయాణిస్తుండగా… ఆ వ్యాన్ ను ట్రాక్టర్ వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని మరో ఇద్దరు విద్యార్ధులకు తీవ్రంగా గాయాలు అయ్యాయని వారిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కెనడాలోని ఇండియన్ హై కమిషనర్ అజయ్ బిసారియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

కెనడాలో శనివారం (మార్చి 9,2022) టొరంటో సమీపంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు ఆటో యాక్సిడెంట్ లో మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల స్నేహితులతో తాము టచ్ లో ఉన్నామని చెప్పారు. మృతులను హర్ ప్రీత్ సింగ్ (21), జస్పీందర్ సింగ్ (21), కరణ్ పాల్ సింగ్(22), మోహిత్ చౌహాన్ (23) , పవన్ కుమార్ (23) గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై భారత్ లోని భారత్ హై కమిషనర్ తన సంతాపాన్ని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలని తన సంతాపాన్ని తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలిపారు.