Canada Parliament : కెనడా పార్లమెంట్‌లో కలకలం.. భవనానికి తాళాలు వేసిన పోలీసులు, అసలేం జరిగింది?
పార్లమెంటుకు సమీపంలోని రహదారులన్నీ మూసివేశారు అధికారులు. ప్రజలు ఎవరూ అటువైపు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు.

Canada Parliament : కెనడా పార్లమెంట్ లో కలకలం రేగింది. ఓ దుండగుడు పార్లమెంటు భవనంలోకి ప్రవేశించాడు. రాత్రంతా భవనం లోపలే ఉన్నాడు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా పార్లమెంట్ భవనాన్ని తాత్కాలికంగా మూసివేశారు. పార్లమెంట్ కి తాళాలు వేశారు.
కెనడా పార్లమెంటు భవనాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు ఒట్టావా పోలీసులు వెల్లడించారు. శనివారం పార్లమెంట్ భవనంలోకి దుండగుడు ప్రవేశించాడని, దాంతో పార్లమెంట్ భవనానికి తాళాలు వేసినట్లు చెప్పారు. పార్లమెంట్ హిల్‌లోని తూర్పు బ్లాక్‌లోకి ఓ వ్యక్తి అక్రమంగా ప్రవేశించాడు. అతడు రాత్రంతా లోపలే ఉన్నాడు. అతడి దగ్గర ఆయుధాలు ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.
Also Read : ఎలుకా మజాకా.. ల్యాండ్ మైన్స్ కనిపెట్టడంలో మూషికం వరల్డ్ రికార్డ్, ఏకంగా 109 మందుపాతరలను గుర్తించింది..
దుండగుడు పార్లమెంట్ భవనంలోకి చొరబడటం తీవ్ర కలకలం రేపింది. అధికారులు అలర్ట్ అయ్యారు. భవనం చుట్టూ పోలీసులను మోహరించారు. తూర్పు బ్లాక్‌లో ఉన్న సిబ్బంది మొత్తం ఒకే గదిలోకి వెళ్లి తాళాలు వేసుకోవాలని అధికారులు సూచించారు. భవనంలోని పలు ప్రదేశాల్లో లాక్‌డౌన్ విధించారు. ఈ ఘటన నేపథ్యంలో పార్లమెంటుకు సమీపంలోని రహదారులన్నీ మూసివేశారు అధికారులు. ప్రజలు ఎవరూ అటువైపు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం దుండగుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
కెనడాలో అక్టోబర్ 27న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, దాదాపు 6 నెలలకు ముందుగానే ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 28న జరగనున్న ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పార్లమెంటును రద్దు చేశారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ.
Also Read : ట్రంప్ కు షాకిస్తున్న అమెరికన్లు.. ‘హ్యాండ్సాఫ్’ పేరుతో పెద్దెత్తున నిరసనలు.. 1200 చోట్ల..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్ భవనంలోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడటం ఆ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని దొంగిలించేందుకు దుండగుడు యత్నించి ఉంటాడా అనే యాంగిల్ లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.