Donald Trump: ట్రంప్ కు షాకిస్తున్న అమెరికన్లు.. ‘హ్యాండ్సాఫ్’ పేరుతో పెద్దెత్తున నిరసనలు.. 1200 చోట్ల..

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అమెరికన్ ప్రజలు పెద్దెత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.

Donald Trump: ట్రంప్ కు షాకిస్తున్న అమెరికన్లు.. ‘హ్యాండ్సాఫ్’ పేరుతో పెద్దెత్తున నిరసనలు.. 1200 చోట్ల..

protest

Updated On : April 6, 2025 / 12:56 PM IST

Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం, మానవ హక్కులు, ఇతర అంశాలపై ట్రంప్ తోపాటు బిలియనీర్ ఎలాన్ మస్క్ తీరును అమెరికన్లు తప్పుబడుతున్నారు. దీంతో లక్షలాది మంది అమెరికన్లు ‘హ్యాండ్సాఫ్’ పేరుతో రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారు. నార్త్ కరోలిని, మసాచుసెట్స్, వాషింగ్టన్ డీసీ సహా అమెరికా వ్యాప్తంగా 1200 చోట్ల పెద్దెత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. అమెరికన్లు కోరుకుంటున్నట్లుగా ట్రంప్ పాలన లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

Also Read: Khushdil Shah: వరుస ఓటములు.. అభిమానులపై దాడికి యత్నించిన పాక్ క్రికెటర్.. వీడియో వైరల్.. స్పందించిన పీసీబీ

ఉద్యోగుల తొలగింపులు, సామాజిక భద్రతా పరిపాలన ప్రాంతీయ కార్యాలయాల మూసివేత, వలసదారుల బహిష్కరణ, లింగమార్పిడి వ్యక్తుల రక్షణ, ఆరోగ్య కార్యక్రమాల నిధుల కోతపై ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్, మస్క్ లకు వ్యతిరేకంగా శనివారం జరిగిన నిరసనలను 2017 ఉమెన్స్ మార్చ్, 2020 బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనల స్థాయి నిరసనగా పరిగణిస్తున్నారు. ఆ రెండు ఘటనల తరువాత శనివారం అమెరికాలో జరిగిన ప్రదర్శనలు అతిపెద్దవి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోకపోతే నిరసనలను తీవ్రతరం చేస్తామని నిరసనకారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: Trump tariff: దెబ్బకు దెబ్బ.. అమెరికా మీద చైనా టారిఫ్… ఇప్పుడు ఉన్నదానికంటే అదనంగా..

అమెరికాలోని బోస్టన్ లో నిరసనకారులు అమెరికన్ విశ్వవిద్యాలయ విద్యార్థులపై ఇమ్మిగ్రేషన్ సంబంధిత దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నట్లు తెలిపారు. ఇక్కడి విశ్వవిద్యాలయంలోని చాలా మంది విదేశీ విద్యార్థులను అరెస్టు చేసి, బహిష్కరించారు. ఆరోగ్య సేవలలో కోతలపై చాలా మంది నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీపై ట్రంప్ పరిపాలన కఠినంగా ఉండటం కూడా ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది. దేశ వనరులను దుర్వినియోగం చేసే హక్కును ఎలాన్ మస్క్‌కు ఇస్తున్నారని కూడా నిరసనకారులు ట్రంప్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.