Cargo Plane : కార్గో విమానం ల్యాండ్ అవుతూనే రెండు ముక్కలైంది.. వీడియో వైరల్!

Cargo Plane : కోస్టారికాలో కార్గో విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండ్ అవుతూనే రెండు ముక్కలైంది. దీనికిసంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి.

Cargo Plane : కార్గో విమానం ల్యాండ్ అవుతూనే రెండు ముక్కలైంది.. వీడియో వైరల్!

Cargo Plane Splits In 2 After Crash Landing At Costa Rica Airport

Updated On : April 8, 2022 / 12:43 PM IST

Cargo Plane : కోస్టారికాలో కార్గో విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండ్ అవుతూనే రెండు ముక్కలైంది. దీనికిసంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. బోయింగ్ 757 కార్గో విమానం కోస్టారికా కాలమానం ప్రకారం.. శాన్ జోస్ లోని శాంతామారియా అంతర్జాతీయ విమానశ్రయం నుంచి గురువారం (ఏప్రిల్ 7) ఉదయం 10గంటలకు బయల్దేరింది.

టేకాఫ్ అయిన 25 నిమిషాలకే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మెకానికల్ ఫెయిల్యూర్ అయినట్టు పైలట్లు గుర్తించారు. వెంటనే అత్యవసర ల్యాండింగ్ అనుమతి కోసం సమాచారం అందించారు. ఆదేశాలు రావడంతో వెంటనే కార్గో విమానాన్ని ఎయిర్ పోర్టుకు తిరుగు పయనమయ్యారు.

ఈ క్రమంలోనే కార్గో విమానం ల్యాండ్ అవుతూ రన్ వేపై జారిపోయింది. విమానం కాస్తా రెండు ముక్కలైంది. వెంటనే మంటలు చెలరేగాయి. ఎయిర్ పోర్టు సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో కార్గో విమానంలో చెలరేగిన మంటలను ఆర్పేశారు. ఈ కార్గో విమానం జర్మన్ లాజిస్టిక్స్ దిగ్గజం ‘డీహెచ్ఎల్’ కంపెనీకి చెందిన అధికారులు వెల్లడించారు.

విమాన ప్రమాదం సమయంలో ఇద్దరు క్రూ సిబ్బంది ఉన్నారు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది. వారిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కార్గో విమానం రెండు ముక్కలైన ప్రమాదానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో అవుతోంది. ఇదే ఆ వీడియో..

Read Also : Flight U turn: ప్రయాణికురాలు మాస్క్ ధరించలేదని “యూ టర్న్” తీసుకున్న విమానం