మీకు తెలుసా.. నీళ్లల్లో తిమింగళాలు మెరుస్తాయ్!!
జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 2009లో వచ్చిన అవతార్. వెండితెరపై ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించాడు. ప్యాండోరా గ్రహానికి చెందిన బయోల్యూమినెసెంట్ జీవులను చూపించి ఫుల్ ఫ్యామస్ అయ

జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 2009లో వచ్చిన అవతార్. వెండితెరపై ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించాడు. ప్యాండోరా గ్రహానికి చెందిన బయోల్యూమినెసెంట్ జీవులను చూపించి ఫుల్ ఫ్యామస్ అయ్యాడు. బయోల్యూమినెసెన్స్ అనేది కేవలం ఫిక్షన్ సినిమాలకు మాత్రమే పరిమితమా.. కచ్చితంగా కాదు. ఆ ఇన్‌స్పిరేషన్‌తో నిజ జీవితాల్లోనూ అద్భుతాలు చూడగలం.
మెరిసిపోతున్న డాల్ఫిన్లు కనిపించి దీనిని నిజం చేశాయి. కాలిఫోర్నియాలోని న్యూ పోర్ట్ బీచ్ లో ఏప్రిల్ 15న ఇది కనిపించింది. అది చూసిన ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించడంతో అద్భుత ఘట్టాన్ని నిజ జీవితంలోనూ రికార్డు చేయగలిగాడు. నదిలో ఎలక్ట్రిక్ బ్లూ లైట్ వెలుగుతుంటే రెండు తిమింగళాలు ఈదుకుంటూ వెళుతున్నాయి. వాటి మీద పడిన కాంతికి అవి బయోల్యూమినోసెన్స్ తో మెరిసిపోయాయి. అచ్చం అది సినిమాల్లో చూపించినట్లుగానే అనిపించిందంటున్నాడు ఫొటోగ్రాఫర్.
ఇది ప్రతిసారీ జరగదు. ఆల్గే మొక్కలు ఉన్న ప్రాంతంలో కాస్త బయోల్యూమినెసెన్స్ ఉండటం గమనించగలం. కాస్త దూరంలో ఉన్నప్పటికీ ఓ అద్భుతమైన వీడియో షూట్ చేశాను. మీ కళ్లారా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అంత చీకట్లో ఉండి వేరే పడవలో నుంచి షూట్ చేయడం కాస్త కష్టంగానే అనిపించింది. ఇది నాకు చాలెంజింగ్ వీడియో.
నీళ్లలో ఇలాంటి ఫేడ్స్ వెతకడం చాలా కష్టమైన పనే. అదొక్కటే కాదు నీళ్లలో ఉన్న ప్రతి నలుపు రంగు జంతువు మెరుస్తుందని కాదు. పరిస్థితులకు తగ్గట్లుగానే బయోల్యూమినెసెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ సమయంలో అవి ఈదుతుంటే మనం వీడియో తీయగలమని రాసుకొచ్చి ఇనిస్టాగ్రామ్ లో పోస్టు చేశాడు ఫొటోగ్రాఫర్ పాట్రిక్.