Dog Vaccine for Corona : కరోనా టీకాకు బదులు కుక్కల వ్యాక్సిన్ వేసిన డాక్టర్లు..!

Dog Vaccine for Corona : కరోనా టీకాకు బదులు కుక్కల వ్యాక్సిన్ వేసిన డాక్టర్లు..!

Chile Vets Fined For Giving Dog Vaccines Against Covid 19

Dog vaccine for Corona in Chile : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో జరుగుతున్న పొరపాట్లు ఆందోళన కలిగిస్తోంది. సిబ్బంది నిర్లక్ష్యంతో జనాల ప్రాణాలమీదకు వస్తోంది. మెడికల్ సిబ్బంది ఫోన్ మాట్లాడుతూ ఓ మహిళకు రెండుసార్లు కరోనా వ్యాక్సిన్ వేసిన ఘటన గురించి విన్నాం. అలాగే మొదటి డోసు కోవీషీల్డ్‌ టీకా వేసి రెండో డోసులో కోవాక్సిన్ వేసిన ఘటనల గురించి విన్నాం. కానీ చిలీ దేశంలో మాత్రం దీనికి డిఫరెంట్ ఘటన జరిగింది. ఓ డాక్టర్ ఏకంగా కరోనా వ్యాక్సిన్ వేయటానికి బదులుగా ఇద్దరు డాక్టర్లు కుక్కలకు ఇచ్చే వ్యాక్సిన్ వేసిన ఘటన నోరెళ్లబెట్టేలా చేసింది. దీనిపై చిలీ ఆరోగ్యశాఖ తీవ్రంగా స్పందించింది. సదరు డాక్టర్లకు భారీ జరిమానా విధించారు.

ఇక్కడ గమనించాల్సిన ఓ విషయం ఏమింటంటే..కరోనా వ్యాక్సిన్ కు బదులుగా కుక్కల టీకా వేసిన డాక్టర్లు పొరపాటున అలా చేసారనుకుంటే పొరపాటే. ఇద్దరు డాక్టర్లు కావాలనే కుక్కల టీకా వేస్తే బాగా పనిచేస్తుందని ప్రచారం చేయటం గమనించాల్సిన విషయం. కోవిడ్ పై ఈ కుక్కల టీకా వేస్తే బాగా పనిచేస్తుందని వాళ్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో చిలీ ఆరోగ్య శాఖ తీవ్రంగా మందలించింది.

ఉత్తర చిలీలోని కాలామా నగరంలో ఫెర్నాండా మునోజ్ అనే మహిళ ఓ ఏజెన్సీలో పశువుల డాక్టర్ గా పనిచస్తోంది. ఆమె సొంతంగా కనైన్ టీకాను తీసుకుంది. కరోనా మహమ్మారిని ఇది నిర్వీర్యం చేస్తుందని ప్రచారం చేస్తూ కొంతమందికి ఈ కుక్కల వ్యాక్సిన్‌ను ఇస్తోంది. దీనిపై చిలీ డిప్యూటీ హెల్త్ సెక్రటరీ రోక్సానా డియాజ్ స్పందించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. కనైన్ వ్యాక్సిన్ తీసుకోవడం ప్రమాదకరమని ఆయన చెప్పారు.

కుక్కల వ్యాక్సిన్ మనుషులకు ఇవ్వడం అనైతికమని..ఇది కరోరాను నిర్వీర్యం చేస్తుందనేది సరైంది కాదని తెలిపారు. ప్రజలందరూ కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. కుక్కల టీకాలు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే అంశంపై ఎలాంటి అధ్యయనం చేయలేదు. మరోవైపు ఈ టీకా వాడటం వల్ల తాను ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదని ఫెర్నాండా మునోజ్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపింది. కానీ గతేడాది చిలీలో వ్యాక్సిన్ రాకముందు జరిగినట్టు తెలుస్తోంది.

ఈ గందరగోళం గురించి అమెరికాకు చెందిన వీసీఏ వెటర్నరీ హాస్పిటల్ స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ.. కుక్కల్లోనూ పేగు వ్యాధికి కారణమయ్యే వైరస్‌ను నిరోధించేందుకు కనైన్ వ్యాక్సిన్ ఉపయోగిస్తారని తెలిపింది. కుక్కల టీకాలను కరోనా వ్యాక్సిన్‌గా ఇచ్చిన బృందంలో మునోజ్‌తో పాటు కార్లోస్ పార్డో అనే మరో పశువైద్యుడు కూడా ఉన్నారు. ఆ దేశ ఆరోగ్య శాఖ పార్డోకు 9200 డాలర్లు, మునోజ్‌కు 10,300 డాలర్ల జరిమానా విధించింది. అయితే ఇద్దరూ ఈ జరిమానాపై కోర్టులో అప్పీల్ చేయటం మరో విశేషం.