China : 70 ఏండ్ల తర్వాత..మలేరియాపై చైనా విజయం
చైనా దేశంలో మలేరియా లేదు. మలేరియా ఫ్రీ దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. వ్యాధిని నిర్మూలించేందుకు దాదాపు 70 ఏండ్లు పట్టడం గమనార్హం. గత నాలుగు సంవత్సరాల నుంచి చైనాలో మలేరియా కేసులు నమోదు కాలేదు.

China
China Certified Malaria-Free After 70-Year : చైనా దేశంలో మలేరియా లేదు. మలేరియా ఫ్రీ దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. వ్యాధిని నిర్మూలించేందుకు దాదాపు 70 ఏండ్లు పట్టడం గమనార్హం. గత నాలుగు సంవత్సరాల నుంచి చైనాలో మలేరియా కేసులు నమోదు కాలేదు. చైనా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల..మలేరియా తగ్గుముఖం పట్టింది. ఎవరూ కూడా ఈ వ్యాధి బారిన పడలేదు. 1940లో 30 మిలియన్ల మలేరియా కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో మలేరియా రహిత దేశాల జాబితాలో చైనా 40వ దేశంగా నిలిచింది.
మూడు సంవత్సరాలుగా వరుసగా మలేరియా కేసులు నమోదు కాకపోతుండడంతో డబ్ల్యూహెచ్ వోకు దరఖాస్తు చేసుకోనే వీలుంది. దీనిపై డబ్ల్యూ హెచ్ వో ప్రతినిధులు పరిశోధన చేస్తారు. ఒక్క కేసు కూడా లేదని నిర్ధారించుకున్న అనంతరం మలేరియా రహిత దేశంగా ప్రకటిస్తుంది. 2019లో అల్జిరియా, అర్జెంటీనా, 2020లో ఈఐ సల్వాడర్ దేశాలు మలేరియా రహిత దేశాలుగా నిలిచాయి. మలేరియా రహిత దేశంగా చైనా అవతరించడంతో డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానామ్ గేబ్రియస్.. ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.