న్యూయార్క్ కు 1,000 వెంటిలేటర్లు విరాళంగా ఇచ్చిన చైనా

  • Published By: venkaiahnaidu ,Published On : April 5, 2020 / 12:08 PM IST
న్యూయార్క్ కు 1,000 వెంటిలేటర్లు విరాళంగా ఇచ్చిన చైనా

Updated On : April 5, 2020 / 12:08 PM IST

అమెరికాలో కరోనా వైరస్(COVID-19)ఎపిక్ సెంటర్ గా మారిన న్యూయార్క్ కు దాదాపు 1,000వెంటిలేటర్లను డొనేట్ చేసింది చైనా. న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1లక్షా 15వేలకు చేరిన  నేపథ్యంలో ప్రాణాలను రక్షించే పరికరాల సరఫరా తగినంతగా లేకపోవడంతో అక్కడి అధికారులు తలలుపట్టుకుంటున్న సమయంలో చైనా 1,000 వెంటిలేటర్లను న్యూయార్క్ కి దానం చేసింది.

దేశానికి సుమారు 10 వేల వెంటిలేటర్ల నిల్వను కలిగి ఉన్న ఫెడరల్ ప్రభుత్వం నుంచి న్యూయార్క్ 17వేల వెంటిలేటర్లను ఆర్డర్ చేసిందని న్యూయార్క్ గవర్నర్ ఆండ్ర్యూ కౌమో శనివారం తెలిపారు. అమెరికాలో కరోనా కేసులు సంఖ్య3లక్షలు దాటిన సమయంలో ఉన్నట్లుండి అమెరికా వ్యాప్తంగా లైఫ్ సేవింగ్ మెడికల్ పరికరాల కు డిమాండ్ పెరిగిందని ఆయన తెలిపారు.

ఈ దేశంలో ఉత్పాదక సామర్థ్యం లేని ఈ పరిస్థితిలో మనం ఎందుకు గాయపడ్డామో గుర్తించాలి అని ఆయన అన్నారు. సప్లయ్ చైన్ ఇష్యూస్ ని తాను అర్థంచేసుకున్నానని, ఉత్పాదక వ్యయాన్ని అర్థం చేసుకున్నానని, కాని ప్రజారోగ్య కారణం ఉందని ఆండ్యూ తెలిపారు. వెంటిలేటర్లకు ఈ డిమాండ్‌ను తీర్చడానికి న్యూయార్క్ చైనాలో షాపింగ్ చేస్తోంది అని ఆండ్యూ అన్నారు. చైనాను నావిగేట్ చేయడానికి రాష్ట్రానికి సహాయం చేయమని తాను వైట్ హౌస్ ను కోరినట్లు గవర్నర్ ఆండ్యూ చెప్పారు.

తాను చైనా రాయబారితో మాట్లాడానని, ఈ రోజు మాకు నిజంగా శుభవార్త వచ్చింది అని గవర్నర్ అన్నారు.  చైనా ప్రభుత్వానికి, అలీబాబా అధినేత జాక్ మా, జాక్ మా ఫౌండేషన్, అలీబాబా సహ వ్యవస్థాపకుడు జో సాయ్ మరియు చైనా కాన్సుల్ జనరల్ హువాంగ్ పింగ్ లకు ఆండ్యూ కృతజ్ఞతలు తెలిపారు. ఇది చాలా సహాయకారిగా ఉంటుంది … ఇది చాలా పెద్ద విషయం. ఇది మాకు గణనీయమైన వ్యత్యాసాన్ని ఇవ్వబోతోంది అని ఆయన అన్నారు. 

ఇప్పటివరకు అమెరికాలో 3లక్షల 11వేల 637 కరోనా కేసులు నమోదుకాగా,8వేల 454మంది మరణించారు. అత్యధికంగా న్యూయార్క్ లో 1లక్షా 14వేల 775 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత న్యూజెర్సీలో 34వేల 124 కేసులు నమోదయ్యాయి. ఇక అమెరికాలో కరోనా మరణాల విషయానికొస్తే…మరణాల విషయంలో కూడా న్యూయార్క్ మొదటిస్థానంలో ఉంది.

ఒక్క న్యూయార్క్ లోనే ఇప్పటివరకు 3వేల 565 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత న్యూజెర్సీలో అత్యధికంగా 846 మరణాలు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే అమెరికాలో 1,331 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క న్యూయార్క్‌ రాష్ట్రంలో 630 మంది మృతిచెందారంటే ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు చనిపోయినట్లు లెక్క.