China : భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..! ఇండియా టార్గెట్‌గా బంగ్లాదేశ్, చైనా కుట్రలు.. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఎయిర్ బేస్‌పై డ్రాగన్ కన్ను..

ఈ ఎయిర్ బేస్ వల్ల బంగ్లాదేశ్ కు ప్రయోజనాలు ఉన్నా.. భారత్ కు భవిష్యత్తులో ముప్పు వచ్చే ప్రమాదం ఉంది.

China : భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..! ఇండియా టార్గెట్‌గా బంగ్లాదేశ్, చైనా కుట్రలు.. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఎయిర్ బేస్‌పై డ్రాగన్ కన్ను..

Updated On : May 19, 2025 / 12:11 AM IST

China : భారత్ టార్గెట్ గా బంగ్లాదేశ్ చైనాతో చేతులు కలుపుతోందా? ఈశాన్య రాష్ట్రాలపై డ్రాగన్ కన్నేసిందా? ఓవైపు పాక్ కయ్యానికి కాలు దువ్వుతుంటే.. చైనా సైలెంట్ గా బంగ్లాతో కలిసి పావులు కదుపుతోంది. ఇప్పటికే పాక్ తో కలిసి కశ్మీర్ లో ఇబ్బందులు కలిగిస్తున్న చైనా.. ఈశాన్య రాష్ట్రాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇందులో బంగ్లాదేశ్ ను డ్రాగన్ కంట్రీ పావుగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. భారత్ ను దెబ్బతీసేలా బంగ్లాదేశ్ లో రెండో ప్రపంచ యుద్ధం నాటి ఎయిర్ బేస్ ను అభివృద్ధి చేసే దిశగా చైనా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

ఈశాన్య రాష్ట్రాలపై డ్రాగన్ కంట్రీ కన్నేయాలని చూస్తోంది. ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధం నాటి ఎయిర్ బేస్ ను అభివృద్ధి చేయాలని చూస్తోంది. ఒకవేళ చైనా ఈ ఎయిర్ బేస్ ను అభివృద్ధి చేస్తే భారత్ కు ఇబ్బందులు తప్పవు. ఇది భారత దేశ భద్రతకు పెద్ద ముప్పుగా మారనుంది. చైనా, బంగ్లాదేశ్ లు అభివృద్ధి చేసే ఎయిర్ బేస్ వెస్ట్ బెంగాల్ కు సరిహద్దుకు సిలిగురి కారిడార్ కు సమీపంలో ఉంటుంది.

Also Read: పాకిస్తాన్ పుచ్చ పగిలిపోయింది.. పాక్ పంపిన 600 డ్రోన్లను గాల్లోనే మటాష్ చేసిన భారత ఆర్మీ..

ఈ సిలిగురి కారిడార్ భారత్ లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను కలుపుతుంది. ఈ ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ గా పిలుస్తారు. ఈ కారిడార్ చైనా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ లతో సరిహద్దులను పంచుకుంటుంది. ఇది భారత్ కు అత్యంత కీలకం. ఇక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా భారత్ తో మిగిలిన ఈశాన్య రాష్ట్రాలు వేరవుతాయి. సిలిగురికి సమీపంలో బంగ్లాదేశ్ లోని లాల్ మోనిర్ హట్ వైమానిక స్థావరాన్ని పునరుద్ధరించడంలో చైనా సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తన వైమానిక స్థావరాన్ని అభివృద్ధి చేయడంలో చైనా తన పనులను ముమ్మరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎయిర్ బేస్ ను చైనా పూర్తి చేస్తే భవిష్యత్తులో భారత్ కు ఇబ్బందులు తప్పేలా లేవు.

ఇటీవలే చైనా అధికారులు ఈ ఎయిర్ బేస్ ను సందర్శించినట్లు సమాచారం. ఇక్కడ కనుక చైనా లాల్ మోనిర్ హట్ ఎయిర్ బేస్ ను పునరుద్ధరిస్తే.. ఇది భారత సైనికుల కదలికలను పర్యవేక్షించడానికి లేదా నిఘాను సేకరించేందుకు వీలు కల్పిస్తుంది. ఈ ఎయిర్ బేస్ దక్షిణాసియాలో చైనా తన ప్రాభవాన్ని విస్తరించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎయిర్ బేస్ వల్ల బంగ్లాదేశ్ కు ప్రయోజనాలు ఉన్నా.. భారత్ కు భవిష్యత్తులో ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. మున్ముందు చైనా ఈ స్థావరాన్ని పరోక్షంగా తన సైనిక కార్యకలాపాల కోసం ఉపయోగించే అవకాశం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.