Pakistan Drones Downed: భారత ఆర్మీ సాహసాలు వెలుగులోకి.. పాకిస్థాన్ వదిలిన 600 డ్రోన్లను ఎలా కూల్చేసిందో తెలిస్తే..

చరిత్రలో నిలిచిపోయేలా ఇండియన్ ఆర్మీ తన వెపన్స్ ని వాడింది. పాక్ లెక్కలేనన్ని డ్రోన్లతో భారత మిలిటరీ స్థావరాలపై దాడులకు తెగబడగా..

Pakistan Drones Downed: భారత ఆర్మీ సాహసాలు వెలుగులోకి.. పాకిస్థాన్ వదిలిన 600 డ్రోన్లను ఎలా కూల్చేసిందో తెలిస్తే..

Updated On : May 19, 2025 / 10:48 AM IST

Pakistan Drones Downed: ఆపరేషన్ సిందూర్ కు ఇప్పుడు ఇచ్చింది బ్రేకే. పాకిస్తాన్ తన తీరు మార్చుకోకపోతే మళ్లీ దాని పుచ్చ పగిలిపోవడం ఖాయం. అసలు మొదటి దఫా చేసిన దాడి నుంచి పాక్ ఇంకా తేరుకోలేదు. భారత్ పై సరిహద్దుల వెంబడి డ్రోన్లతో దాడి చేసి బిల్డప్ ఇద్దామనుకున్న పాక్ కి ఇండియన్ ఆర్మీ ఇచ్చిన షాక్ అలాంటిది ఇలాంటిది కాదు. ఏకంగా 600 డ్రోన్లను ఇండియన్ ఆర్మీ గాల్లోనే ఎక్కడికక్కడ మాటాష్ చేసింది. అసలు భారత సైన్యం ఈ స్థాయిలో ఎదురుదాడితో పాటు పాక్ లోని ఎయిర్ బేస్ లపై దాడి చేయడం చరిత్రలో నిలిచిపోయే సందర్భం.

ఓ మినీ వార్ ముగిసిన తర్వాత భారత సైన్యం సాధించిన అద్భుత విజయానికి కారణమైన విషయాలు ప్రతిరోజూ చర్చకు వస్తున్నాయి. చరిత్రలో నిలిచిపోయేలా ఇండియన్ ఆర్మీ తన వెపన్స్ ని వాడింది. పాక్ లెక్కలేనన్ని డ్రోన్లతో భారత మిలిటరీ స్థావరాలపై దాడులకు తెగబడగా.. భారత్ ఈ దాడులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో సమర్థవంతంగా ఎదుర్కొని పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడే గాల్లోనే కూల్చేసింది.

పాక్ డ్రోన్లను కూల్చివేయడానికి వెయ్యి గన్ సిస్టమ్ లు, సుమారు 750 షార్ట్ అండ్ మీడియం రేంజ్ క్షిపణులను మోహరించింది భారత సైన్యం. సరిహద్దుల్లో దాడులను ఊహించిన ఇండియన్ ఆర్మీ.. ముందస్తుగా జాయింట్ ఎయిర్ డిఫెన్స్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచే డ్రోన్ దాడులను తిప్పికొట్టి కీలక వ్యూహాత్మక ఆస్తులను పరిరక్షించుకుంది.

Also Read: భారత్‌తో పెట్టుకోవద్దు.. పాకిస్తాన్‌కు IMF బిగ్ షాక్.. నిధుల మంజూరుకు 11 షరతులు..

దాడికి ముందు పాక్ రాడార్లను యాక్టివేట్ చేసేందుకు డమ్మీ ఎయిర్ క్రాఫ్ట్ లను భారత సైన్యం మోహరించడమే కాకుండా పాక్ భూభాగంపైకి పంపింది. దీంతో పాక్ రాడార్లు కీలకమైన ఎయిర్, మిలటరీ బేస్ లను యాక్టివేట్ చేసి యుద్ధానికి తమ సైన్యాన్ని సన్నద్ధం చేసింది. వెంటనే ఆయా స్థావరాలపై తమ అసలు సిసలు క్షిపణులు పంపింది. శత్రు భయంకర బ్రహ్మోస్ తో ఉన్న చోటు నుంచే దాడులు చేసింది.

దాదాపు 200 కిలోమీటర్ల మేర ప్రయాణించిన ఈ మిస్సైల్స్ నూర్ ఖాన్ సహా 11 స్థావరాలపై దాడి చేశాయి. ఈ క్రమంలోనే పాక్ ప్రధాని నివాసం పక్కన కూడా బాంబింగ్ జరగ్గా అర్థరాత్రి రెండున్నరకు ఉన్నవాడు ఉన్నట్లే లుంగీ పైజామాతో పరార్ కావాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించుకున్నారు కూడా. భారత్ క్షిపణి దాడి చేసిందే నిజమేనని, తెల్లవారుజామున 2.30 గంటలకు నిద్రలేవాల్సి వచ్చిందని చెప్పాడాయన.