China : చైనా టార్చ్‌బేరర్ వివాదం.. ఒలింపిక్ జ్యోతిని అందుకున్నది ఎవరు?
డ్రాగన్ చేసిన పనికి అన్నీ దేశాలు ఛీ కొడుతున్నాయి. వింటర్ ఒలింపిక్ టార్చ్ రిలేను నిర్వహించిన ఆతిథ్య చైనా.. టార్చ్‌బేరర్‌గా క్వీ ఫబోవోను ఎంచుకుంది. అతనెవరో కాదు...

China
Olympic Torchbearer : చైనా తీరు రోజు రోజుకు శృతి మించుతోంది. మొన్నటి వరకు సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్విన చైనా.. ఇప్పుడు భారతదేశంపై బురదజల్లేందుకు విశ్వక్రీడలను వేదికగా చేసుకుంది. ఓవైపు కరోనా కేసులను తక్కువ చేసి చూపించి.. ఒలింపిక్స్‌ను నిర్వహిస్తోంది. అది చాలదన్నట్లు సరిహద్దు వివాదాలను అందరి దృష్టికి తీసుకెళ్లాలని చైనా చేసిన ప్రయత్నం తేడా కొట్టింది. డ్రాగన్ చేసిన పనికి అన్నీ దేశాలు ఛీ కొడుతున్నాయి. వింటర్ ఒలింపిక్ టార్చ్ రిలేను నిర్వహించిన ఆతిథ్య చైనా.. టార్చ్‌బేరర్‌గా క్వీ ఫబోవోను ఎంచుకుంది. అతనెవరో కాదు… గల్వాన్ లోయ ఘర్షణలో భారతదేశ బలగాలపై దాడి చేసిన చైనా సైనికుడు. మన దేశ భూభాగంలోకి వచ్చి దాడికి దిగిన సైనికుడికి ఒలింపిక్ టార్చ్‌ను అందించడం ద్వారా చైనా తన బుద్ధిని బయటపెట్టుకుంది.
Read More : Deepika Padukune : అనన్య పాండే ఎవరో నాకు తెలీదు.. దీపికా పదుకునే వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ట్రోలింగ్
చైనా సిగ్గుమాలిన చర్యను భారత్‌తో పాటు అమెరికా ఇతర దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. క్వీ ఫబోవో…గల్వాన్ లోయ దాడిలో పాల్గొన్న కమాండర్ మాత్రమే కాదు… అతడు ఉయిగర్ ముస్లీంల ఊచకోతకు కారణమైన వ్యక్తి కూడా..! అలాంటి వ్యక్తిని విశ్వక్రీడలకు టార్చ్‌బేరర్‌గా ఎంచుకోవడాన్ని అన్ని దేశాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. అసలు ఇలాంటి చర్యల ద్వారా చైనా ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపాలనుకుంటోందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే భారత సార్వభౌమత్వానికి, ఉయిగర్ల స్వేచ్ఛకు అమెరికా ఎప్పుడూ మద్ధతు ఇస్తూనే ఉంటుందని.. యూఎస్ సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ర్యాంకింగ్ మెంబర్ ట్వీట్ చేశారు. చైనాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌ను బహిష్కరించాలంటూ అమెరికా, ఆస్ట్రేలియా, కొన్ని యూరప్ దేశాలు కూడా ప్రతిపాదించాయి. కానీ, ఆ సమయంలోనూ మన దేశం మద్దతు పలకలేదు. రాజకీయాలను, క్రీడలతో ముడిపెట్టకూడదనే చెప్పింది. అయినా.. చైనా మాత్రం ఇలా గాల్వాన్‌లో ఘర్షణ పడ్డ సైనికుడితో ఒలింపిక్ జ్యోతి రిలే ప్రారంభించడం ఆ దేశ నీచబుద్ధిని తేటతెల్లం చేసింది. అయితే.. చైనా తీరుకు నిరసనగా ప్రారంభ వేడుకలు సహా ఒలింపిక్ కార్యక్రమానికి మన దేశం నుంచి ఎవరినీ పంపడం లేదు.
Read More : Statue of Equality : సమతామూర్తి… మూడో రోజు కార్యక్రమాలు
సరిహద్దు వివాదాలను మరోసారి లేవనెత్తిన చైనాకు ఇంకో షాక్ తగిలింది. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో డ్రాగన్ చెప్పినదాని కంటే ఎక్కువ నష్టపోయిందని ఆస్ట్రేలియన్ పరిశోధనాత్మక కథనం ఒకటి బయటకొచ్చింది. చీకటిలో వేగంగా ప్రవహిస్తున్న నదిని దాటుతున్నప్పుడు చాలామంది చైనా సైనికులు కొట్టుకుపోయారని ది క్లాక్సన్ పత్రిక తెలిపింది. అప్పటికే నదిలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండడంతో వారు బతికుండే ఛాన్సే లేదని బలగుద్ది చెప్పింది. గల్వాన్ డీకోడెడ్ టైటిల్‌తో ఏడాది పాటు సాగిన పరిశోధనల్లో చైనా బ్లాగర్లతో కూడా విస్తృత చర్చలు జరిపారు. ఆందులోనే ఈ నిజాలన్నీ బయటపడ్డాయి. గల్వాన్ లోయలో జూన్ 15న భారత్-చైనా సైనికుల మధ్య పెద్దఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ విషయాన్ని భారత్ అధికారికంగా ప్రకటించింది. కానీ చైనా మాత్రం తమ సైనికులు నలుగురే చనిపోయారని ప్రకటించింది. గల్వాన్ లోయ ఘర్షణల్లో చనిపోయిన చైనా సైనికుల సంఖ్య 40 కంటే ఎక్కువగా ఉంటుందన్నది ఓ అంచనా ! అమరువీరులైన మన సైనికులకు దేశమంతా సెల్యూట్ చేసి వారికి గౌరవ బిరుదులిచ్చి.. వారి కుటుంబాలకు అండగా నిలిచింది. కానీ చైనా మాత్రం ఎక్కడ తమ పరువుపోతుందేమోనని… రహస్యంగా సైనికుల అంత్యక్రియలు జరిపించి… పైకి మాత్రం నలుగురే చనిపోయారని చెప్పుకుంది.