China Mission: చంద్రునిపైకి మనుషులను తీసుకెళ్లేందుకు వేగవంతంగా చైనా ప్రయత్నాలు
చంద్రునిపై వాతావరణాన్ని పరిశీలించేందుకు ప్రణాళికలు రచిస్తోన్న చైనా వేగం పుంజుకుంది. జనవరి 2019లో చంద్రుని సుదూర వైపున ఒక ప్రోబ్ ను పంపిన మొదటి దేశంగా ఘనత దక్కించుకుంది.

Moon Mission
China Mission: చంద్రునిపై వాతావరణాన్ని పరిశీలించేందుకు ప్రణాళికలు రచిస్తోన్న చైనా వేగం పుంజుకుంది. జనవరి 2019లో చంద్రుని సుదూర వైపున ఒక ప్రోబ్ ను పంపిన మొదటి దేశంగా ఘనత దక్కించుకుంది. ఇప్పుడిక ఏకంగా చంద్రునిపైకి మనుషులను తీసుకెళ్లడానికి సిద్ధమై పరిధిని విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. మానవ సహిత ల్యాండింగ్ ప్రాజెక్టు కోసం వేగవంతమైన చర్యలు జరిపేందుకు సిద్ధమైంది.
జియామెన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ ప్రచురించిన ఒక సంక్షిప్త వార్తా నివేదిక ప్రకారం.. ‘చంద్రుని మీద మానవ సహిత ల్యాండింగ్ కోసం సిస్టమ్‌ను డెవలప్ చేయాలనే లక్ష్యంతో’ చైనా ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
ఈ రిపోర్టులో చంద్రుని మీదకు మానవులను తీసుకెళ్లే ప్రాజెక్టును ‘నేషనల్ ప్రాజెక్ట్’గా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. పలు అనుబంధ ప్రాజెక్టులకు నాయకత్వం వహించే వ్యక్తుల పేర్లను అందులో ప్రస్తావించారు. చైనా అకాడమీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ(కాస్ట్)లోని పలువురు సభ్యులు, గవర్నమెంట్ మేనేజ్మెంట్ చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ కలిసి ఈ ప్రయోగ వాహనం కోసం శ్రమిస్తున్నారు.
రిపోర్టు ప్రకారం.. ల్యాండర్ డెవలప్మెంట్ కోసం ఏ ప్రణాళికలు సిద్ధం చేశారో.. సమావేశం స్పష్టం చేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలో చైనా కూడా చంద్రుని పైకి మానవులను తీసుకెళ్లేందుకు సూపర్-హెవీ లాంచ్ వాహనాలను రెడీ చేస్తున్నట్లుగా ప్రకటించింది.