కరోనా: వర్కర్స్ కోసం చైనా మాల్స్ ఫ్రీగా డ్రింక్స్..స్నాక్స్

కరోనా..చైనా వాసుల్నే కాదు ప్రపంచ దేశాల ప్రజలను వణికించేస్తోంది. ఒకవైపు కరోనా వైస్ సోకుతుందనే భయం..మరోపక్క పనిచేయకపోతే గడవని పరిస్థితి. చిన్న చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునేవారి వరకూ చైనాలో కరోనా భయం వెంటాడుతోంది. దీంతో చాలామంది తమ ఉద్యోగాలకు..డ్యూటీలకు వెళ్లకుండా ఇంటికే పరిమితం అయిపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం తప్పనిసరిగా డ్యూటీలకు హాజరవుతున్నారు.
అలా..కరోనాకు భయపడకుండా (భయపడినా డ్యూటీకి రాకతప్పనివారు) డ్యూటీలకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులు,కొరియర్ బోయ్స్, పోలీసు డిపార్ట్ మెంట్, వాలంటీర్లు వంటి పలువురి కోసం చైనాలో మాల్స్ ఫ్రీగా కూల్ డ్రింక్స్, జ్యూస్ లు..స్నాక్స్, వాటర్ బాటిల్స్ అందిస్తున్నాయి. వారికి అవసరమైన సమయంలో తీసుకోవాటానికి షాంఘై నగరంతో పాటు షెన్ జెన్ సహా పలు నగరాల్లో ఫ్రిజ్ లను ఏర్పాటు చేసి వాటిలో చైనా మాల్స్..సూపర్ మార్కెట్స్ వారు డ్రింక్స్, జ్యూస్ లు..స్నాక్స్ పెడుతున్నారు.
కరోనాకు భయపడుతూ ఇంట్లోనే కూర్చుంటే దేశ ఉత్తత్పి ఆగిపోతుంది. కరోనా భయం ఉన్నా సరే డ్యూటీలకు హాజరయ్యేవారి కోసం పలు నగరాల్లో ఫ్రిజ్ లను ఏర్పాటు చేసి వాటిలో స్నాక్స్ తో పాటు డ్రింక్స్, జ్యూసులు..వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉంచుతున్నారు. అలా ఏర్పాటు చేసిన ఫ్రిజ్ లపై ‘‘మీ కృషికి ధన్యవాదాలు..మేము అంటువ్యాధికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం..విజయం సాధిస్తాం’’ అని రాసి పెట్టారు.
కాగా..కరోనాకు భయపడి వేలాదిమంది చైనీయులు ఇంటికే పరిమితమైపోతున్నారు. దీంతో డ్యూటీకి హాజరయ్యే కొద్దిపాటి మందికి పని భారం పెరుగుతోంది. దీంతో వారు ఒత్తిడికి గురవుతున్నారు. టేక్ అవుట్లు అందించే కొరియర్లకు పనిభారం పెరుగుతోంది. నగరాలను పరిశుభ్రంగా ఉంచే క్లీనర్స్ లకు కూడా పనిభారం పెరుగుతోంది. అటువంటి వారి కోసం చైనాలోని మాల్స్ వారు ఇలా స్నాక్స్ తో పాటు డ్రింక్స్, జ్యూసులు అందుబాటులో ఉంచుతున్నారు.
ఈ సందర్భంగా చైనాలోని షెన్ జెన్ ప్యూటియన్ జిల్లాలోని షాపింగ్ మాల్ ప్రతినిథి కోకో పార్క్ మాట్లాడుతూ..‘‘కష్టపడి పనిచేసే ప్రజలందరికీ మా కృతజ్ఞతలు తెలియజేయాలను ఉద్ధేశంతో ఇలా ఫ్రిజ్ లను ఏర్పాటు చేసిన స్నాక్స్, డ్రింక్స్ అందిస్తున్నాం అని తెలిపారు. గత నెలలో కరోనా బాధితుల కోసం కోకో పార్క్ మాల్ తో పాటు దానికి సంబంధించి తొమ్మిది మార్కెట్ల వారు కలిసి 10 వేల యువాన్లు విరాళంగా ఇచ్చామని తెలిపారు.