గడ్డ కట్టిన చికెన్‌తో కరోనా వైరస్ పాజిటివ్ వస్తుందంటోన్న చైనా

గడ్డ కట్టిన చికెన్‌తో కరోనా వైరస్ పాజిటివ్ వస్తుందంటోన్న చైనా

Updated On : August 13, 2020 / 3:22 PM IST

చైనాలోని షెంజన్ సిటీ ప్రజలు ఇంపోర్టెడ్ ఫుడ్ కొనుక్కోవడానికే భయపడిపోతున్నారు. అక్కడి లోకల్ గవర్నమెంట్ బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న గడ్డకట్టిన చికెన్ వల్ల కరోనా పాజిటివ్ వస్తుందని చెప్పింది. మాంసం పైన లేయర్ శాంపుల్ తీసుకుని టెస్టులకు పంపించారట. ఇంకా చైనాలోని ఇతర సిటీల్లో తీసిన సీ ఫుడ్ శాంపుల్స్ కు కూడా కరోనా పాజిటివ్ గానే తేలాయట.

ఈ చికెన్ ఎక్కడినుంచి వచ్చిందని రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఆరా తీస్తే.. శాంత కెటారినాలోని ఆరోరా అలీమెంటోస్ ప్లాంట్ నుంచి వచ్చిన చికెన్ అని తెలిసింది.

దీనిపై బ్రెజిల్ ప్రభుత్వం స్పందిస్తూ.. వైరస్ టెస్టుల్లో పాజిటివ్ అయిన వ్యక్తులు ఎవరైనా ప్రొడక్ట్ ను కాంటాక్ట్ అయి ఉండొచ్చు. అవి కాకుండా మిగిలిన వాటికి చేసిన టెస్టుల్లో నెగెటివ్ అనే వచ్చిందని గవర్నమెంట్ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. అదే సమయంలో వినియోగదారులు ఫ్రోజెన్ ఫుడ్ (గడ్డ కట్టిన ఆహారం)కొనేముందు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.

చైనా నార్తరన్ సిటీ యాంతాయ్..లో దిగుమతి చేసుకున్న సముద్ర ఆహారం మూడు ప్యాకేజ్ శాంపుల్స్ ను పరీక్షించగా కొవిడ్ 19 పాజిటివ్ అనే వచ్చిందని చైనా ప్రభుత్వం అధికారికంగా మంగళవారం ప్రకటించింది. వూహూలోని రెస్టారెంట్ లో వైరస్ పాజిటివ్ వచ్చినట్లు చైనా జాతీయ మీడియా బుధవారం వెల్లడించింది.