కరోనా దెబ్బకు ఫుడ్ లేకుండా పోయింది!!

కరోనా దెబ్బకు ఫుడ్ లేకుండా పోయింది!!

Updated On : February 8, 2020 / 2:16 PM IST

వైరస్ కారణంగా చైనా ప్రజలు భయంతో బతుకీడుస్తున్నారు. చైనాకు గుండె లాంటి వూహాన్.. లో కరోనా రెచ్చిపోతూనే ఉంది. ఇదిలా ఉంటే వైరస్ బాధితులకు ఆహారం అందించడానికి నానా తంటాలుపడుతున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఆహారం అందించడానికి 50శాతం అదనంగా కూరగాయలు కేటాయించాల్సి వస్తుంది. రద్దీ నగరంలో ఆహారం కరోనా బాధితులకు అందించి ఏ జబ్బు లేకుండా సురక్షితంగా రావడానికి భయపడుతున్నారు. 

వైరస్ వ్యాప్తి కాకుండా తీసుకునే ఆహారం కొరత వూహాన్ నగరాన్ని పట్టిపీడిస్తుంది. జనవరి 23నుంచి ఈ భయంతోనే చాలా ప్రాంతాల్లో ఆహారం దొరకడమే ఇబ్బందిగా మారింది. ల్యూనార్ న్యూ ఇయర్ హాలిడే సమయంలో వైరస్ ఉనికి బయటపడింది. ఆ తర్వాత ఫ్యాక్టరీలు, ఆఫీసులు, ఇతర వ్యాపారాలు అన్నీ మూతపడే ఉన్నాయి. ప్రజలంతా ఇళ్ల దగ్గరే ఉండిపోతున్నారు. 

కేవలం కరోనా బాధితులకే కాకుండా సాధారణ ప్రజలకు సైతం ప్రభుత్వ వాహనాల్లోనే ఆహారం అందించాల్సిన పరిస్థితి. ప్రభుత్వ అధికారులు ఈ సమస్య త్వరలోనే తగ్గుతుందని చెబుతున్నారు. గుడ్లు, పాలు, మాంసం, కూరగాయలు, గోధుమలు లాంటి రోజువారీ అవసరమయ్యే ఆహార పదార్థాలను ప్రభుత్వమే ప్రత్యేక వాహనాల్లో సరఫరా చేస్తుంది.

ఇదే అదనుగా భావించి ఆహార పదార్థాల కొరత రావడంతో కొన్ని మార్కెట్లు భారీగా రేట్లు పెంచేశాయి. ఒక క్యాబేజీ ధరను 400శాతం పెంచడంతో ఆ సూపర్ మార్కెట్‌పై 2మిలియన్ యూవాన్(రూ.2కోట్లు) జరిమానా విధించింది. 2018లో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన స్వైన్ ఫ్లూ కారణంగా పందులను ఎక్కువ సంఖ్యలో చంపేశారు. ప్రస్తుతం అక్కడి ప్రజలు రోజూ తినే పందిమాంసాన్ని సరఫరాచేసేందుకు కూడా ప్రభుత్వం ఇబ్బందులు పడుతుంది. 

గతేడాది పోర్క్ రేట్ డబుల్ అయింది. ఆహార పదార్థాల ధరలన్నీ పెరిగి సామాన్యుడికి అందనంత దూరానికి చేరాయి. ఇవి చాలాక ప్రస్తుత పరిస్థితులను అవకాశంగా చేసుకుని రేట్లు పెంచడంతో ఇబ్బందులు పెరుగుతున్నాయి.