చైనాలో CHIKV వైరస్ ఉద్ధృతి.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 2,00,000కుపైగా కేసులు

ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చైనాలోని పలు ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు.

చైనాలో CHIKV వైరస్ ఉద్ధృతి.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 2,00,000కుపైగా కేసులు

Updated On : July 20, 2025 / 8:33 PM IST

చైనా నుంచి వచ్చిన కరోనా ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇప్పటికీ దాని ప్రభావం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో వైరస్‌పై చైనా ఆరోగ్య శాఖను అలర్ట్ అయింది. CHIKV అని పిలిచే ఈ వైరస్ చైనాలోని చాలా ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వల్ల తీవ్ర జ్వరం వంటి లక్షణాలు వస్తాయి.

ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చైనాలోని పలు ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల్లో అవగాహన పెంచే పనిలో ఉన్నారు. హాంకాంగ్ కూడా ఈ వైరస్‌పై హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: కుబేర సినిమా స్టైల్‌లో ఏపీలోని యాక్సిస్ బ్యాంకును మోసం చేసిన కేటుగాళ్లు.. భారీ స్కామ్..

దోమల ద్వారా చికున్‌గున్యా వ్యాప్తి
చైనాలోని scmp.com అనే మీడియా సంస్థ ప్రకారం.. దక్షిణ చైనాలోని ఫోషాన్ నగరంలో చికున్‌గున్యా వేగంగా వ్యాపిస్తోంది. షుండేలోని ఆరోగ్య విభాగం ప్రకారం.. ఆ ఒక్క ప్రాంతంలోనే నాటికి 1,161 కేసులు నమోదయ్యాయి. షుండేతో పాటు లెకాంగ్, బీజియావో, చెన్కున్, నాన్హై, చాంచెంగ్ ప్రాంతాల్లోనూ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 2,00,000 చికున్‌గున్యా కేసులు
ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 2,20,000 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. చికున్‌గున్యా అనేది CHIKV వైరస్. ఇది దోమల ద్వారా వ్యాపిస్తుంది. దీనివల్ల జ్వరం, ఒంటి నొప్పి వస్తాయి. ఇది కొన్నిసార్లు తీవ్రమైన అనారోగ్యానికి దారి తీయవచ్చు. వర్షాకాలంలో దీని వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ. CHIKV వైరస్ ఆడ దోమల ద్వారా వ్యాపిస్తుంది.