Nikki Haley : చైనా చేతుల్లోకి అప్ఘాన్ కీలక ఎయిర్ బేస్..భారత్ పై దాడికి పాక్ తో కలిసి ఫ్లాన్ !

అప్ఘానిస్తాన్‌లో పరిణామాలను చైనా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోందని ఐరాసలో అమెరికా మాజీ దౌత్యాధికారి నిక్కీ హేలీ హెచ్చరించారు.

Nikki Haley : చైనా చేతుల్లోకి అప్ఘాన్ కీలక ఎయిర్ బేస్..భారత్ పై దాడికి పాక్ తో కలిసి ఫ్లాన్ !

Bagra

Updated On : September 2, 2021 / 7:08 PM IST

Nikki Haley అప్ఘానిస్తాన్‌లో పరిణామాలను చైనా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోందని ఐరాసలో అమెరికా మాజీ దౌత్యాధికారి నిక్కీ హేలీ హెచ్చరించారు. అప్ఘాన్ ను తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశంలోని కీలకమైన బగ్రామ్ వైమానిక స్థావరాన్ని చైనా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని, నిక్కీ హేలీ తెలిపారు. దాదాపు 20 ఏళ్లపాటు అఫ్గన్‌లో యుద్ధం కొనసాగించిన అమెరికా ఈ ఏడాది జులైలోనే బగ్రామ్ వైమానిక స్థావరాన్ని ఖాళీచేసింది. కీలకమైన ఈ స్థావరంలోనే వేలాది మంది అమెరికా సైన్యం ఉండేవారు.

మరోవైపు, భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ని బలోపేతం చేయడానికి చైనా ప్రయత్నించే అవకాశమున్న నేపథ్యంలో ఈ పరిణామాలను అమెరికా నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని నిక్కీ హేలీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంపై అమెరికా దృష్టిసారించాలన్నారు. అమెరికా ముందు అనేక సవాళ్లు ఉన్నాయని ఆమె తెలిపారు. అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ విషయంలో జో బైడెన్ తొందరపాటు నిర్ణయంతో అమెరికా మిత్రదేశాల నమ్మకం, విశ్వాసం కోల్పోయారని నిక్కీ హేలి తెలిపారు.

ప్రస్తుతం బైడెన్ యంత్రాంతగం మిత్రదేశాలైన భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అమెరికా వెన్నుదన్నుగా ఉంటుందని వారికి భరోసా కల్పించాలని అన్నారు. ఇక సైన్యాన్ని ఆధునీకరించడం,అమెరికన్ల భద్రత, దేశ సైబర్ సెక్యూరిటీ బలంగా ఉందని అమెరికా నిర్ధారించుకోవడం ముఖ్యమని,ఎందుకంటే రష్యా వంటి దేశాలు అమెరికాపై హ్యాక్ చేయడాన్ని కొనసాగించబోతున్నారని తెలిపారు.