Chinese Army: చైనా కుతంత్రాలు.. సైన్యంలోకి టిబెట్ యువత!

డ్రాగన్ కంట్రీ కుట్రలు, కుతంత్రాలలో ప్రపంచ దేశాల మీద ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నిస్తుంది. నేలమాళిగల్లో అణ్వాయుధాల ప్రయోగ కేంద్రాన్ని నిర్మిస్తుందని ఉపగ్రహ చిత్రాలతో సహా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయమవుతుండగానే తాజాగా మరో కుట్ర కోణం బయటపడింది. టిబెట్‌లో నివసిస్తున్న యువకులను చైనా తన సైన్యంలోకి తీసుకొని తన బలగాన్ని పెంచుకుంటుంది.

Chinese Army: చైనా కుతంత్రాలు.. సైన్యంలోకి టిబెట్ యువత!

Chinese Army

Updated On : July 10, 2021 / 11:56 AM IST

Chinese Army: డ్రాగన్ కంట్రీ కుట్రలు, కుతంత్రాలలో ప్రపంచ దేశాల మీద ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నిస్తుంది. నేలమాళిగల్లో అణ్వాయుధాల ప్రయోగ కేంద్రాన్ని నిర్మిస్తుందని ఉపగ్రహ చిత్రాలతో సహా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయమవుతుండగానే తాజాగా మరో కుట్ర కోణం బయటపడింది. టిబెట్‌లో నివసిస్తున్న యువకులను చైనా తన సైన్యంలోకి తీసుకొని తన బలగాన్ని పెంచుకుంటుంది. అలా శిక్షణఇచ్చిన యువతను భారత్ సరిహద్దులో భారీగా మోహరిస్తుంది.

ఈ ఏడాది మొదట్లో నుంచి టిబెట్ యువతను ఆర్మీలో చేర్చుకుంటున్న చైనా.. వారికి తర్ఫీదు ఇచ్చిన అనంతరం భారత సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి మోహరిస్తున్నట్లు భారత ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు తెలిపాయి. ఎల్‌ఏసీలో ప్రత్యేక ఆపరేషన్ల కోసం శిక్షనిచ్చిన టిబెటన్‌ బృందాల్ని డ్రాగన్‌ కంట్రీ వాడుకుంటున్నట్టు మన ప్రభుత్వం అంచనా వేస్తోంది. టిబెటన్‌ యువకులకు శిక్షణ మొదలయ్యే ముందే తమ చట్టాలకు లోబడి ఉండేలా నిబంధనలను రూపొందించిన చైనా లిఖితపూర్వక హామీలను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

గతంలో 1962 యుద్ధం సమయంలో టిబెట్‌ నుంచి ఇండియాకు వచ్చిన శరణార్థులు ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ పేరుతో భారత సైన్యానికి అందించారు. అయితే.. అది పూర్తిగా ఒప్పందం ప్రకారం.. శరణార్థులుగా వచ్చిన వారు సాయం అందించారు. కానీ ఇప్పుడు చైనా ఆ వ్యూహాన్నే అమలు చేయాలనుకుంటున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఇప్పుడు చైనా టిబెట్ యువతకు గాలం వేసి ఒప్పందాలతో సైన్యంలో చేర్చుకుంటున్నట్లుగా తెలుస్తుంది.