China : అక్కడ 25 ఏళ్ల కంటే తక్కువ వయసులో పెళ్లి చేసుకుంటే నగదు రివార్డు ఇస్తారట

చైనాలో 25 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసులో పెళ్లి చేసుకునే జంటకు అక్కడి ప్రభుత్వం నగదు రివార్డు ప్రకటించింది. 6 దశాబ్దాల తర్వాత ఆ దేశ జనాభా గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

China : అక్కడ 25 ఏళ్ల కంటే తక్కువ వయసులో పెళ్లి చేసుకుంటే నగదు రివార్డు ఇస్తారట

China

Updated On : August 29, 2023 / 11:09 AM IST

China : అక్కడ పెళ్లి చేసుకునే జంటల సంఖ్య తగ్గిపోతోంది. అందుకోసం అక్కడి ప్రభుత్వం సరైన వయసులో పెళ్లి, పిల్లల్ని కనడాన్ని ప్రోత్సహించడానికి ఒక ప్రకటన చేసింది. 25 అంతకంటే తక్కువ వయసులో పెళ్లి చేసుకున్న జంటలకు నగదు రివార్డ్ ఇవ్వబోతోంది. ఎక్కడ అంటే..?

China : చైనాలో అసలేం జరుగుతోంది

6 దశాబ్దాల తర్వాత చైనాలో జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఆందోళన చెందుతున్న ప్రభుత్వం జనన రేటుని పెంచడం కోసం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వధువు వయస్సు 25 లేదా అంతకంటే తక్కువ ఉన్నట్లైతే చైనీస్ జంటలకు నగదు రివార్డు ప్రకటించింది.

చాంగ్‌షాన్ కౌంటీ యొక్కఅధికారిక Wechat ఖాతాలో ప్రచురించిన నోటీసు ప్రకారం 1,000 యువాన్లు (11,320.36 ఇండియన్ కరెన్సీలో) రివార్డ్ అందిస్తోంది. చైనాలో చట్ట ప్రకారం వివాహ వయో పరిమితి మగవారికి 22, ఆడవారికి 20 కాగా పెళ్లి చేసుకునే జంటల సంఖ్య తగ్గిపోతోంది. జూన్‌లో విడుదల చేసిన ప్రభుత్వ లెక్కల ప్రకారం  2022 లో రికార్డు స్ధాయిలో వివాహ రేటు 6.8 మిలియన్లకు చేరుకున్నాయి. 2021 తో పోలిస్తే గత ఏడాది 800,000 తక్కువ పెళ్లిళ్లు జరిగాయట. చైనాలో సంతానోత్పత్తి రేటు ప్రపంచస్ధాయిలో పడిపోయింది. 2022 లో రికార్డు స్ధాయిలో 1.09 కి పడిపోయిందని అక్కడి మీడియా చెబుతోంది.

China : చైనాలో కొత్త ట్రెండ్ .. టెంపరరీ పార్టనర్స్‌ని కోరుకుంటున్న యువత

చైల్డ్ కేర్ ఖర్చులు, మహిళల కెరియర్ నిలిచిపోవడం వల్ల మహిళలు ఎక్కువమంది పిల్లల్ని కనడం ఆపేశారట. చైనా ఆర్ధిక వ్యవస్థ, ఆరోగ్యంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో అక్కడి యువత పెళ్లి పట్ల విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది.