తోటి టీచర్ కోపంతో 25 మంది నర్సరీ విద్యార్థులకు విషం పెట్టిన టీచర్..మరణశిక్ష విధించిన కోర్టు

chinese teacher sentenced to death for poisoning nursery chldren : చిట్టి పొట్టి చిన్నారుల్ని కొట్టటానికి చేతులు రావు. వారి ముద్దు మోములు చూస్తే ఎంత కోపమైన ఇట్టే ఆవిరైపోతుంది. అటువంటిది ఓటీచర్ తన వద్ద చదువుకునే నర్సరీ విద్యార్ధులకు విషయం పెట్టింది. మొత్తం 25 చిన్కారులకు విషంపెట్టిన దారుణ ఘటన చైనాలో జరిగింది.దీనికి కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తోటి టీచర్ పై ఉన్న కోపంతోనే 25మంది చిన్నారులకు విషయం పెట్టినట్లుగా విచారణలో తేలింది. 2019లో జరిగిన ఈ దారుణ ఘటనపై నేరం రుజువు కావటంతో కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది.
జియాజూలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్ల మధ్య గొడవ జరిగింది.దీంతో పగతో రగిలిపోయిన ఎంఎస్ వాంగ్ అనే టీచర్ పాఠశాలలో విద్యార్థులకు అందించే సూప్ లాంటి పదార్థంలో విషపూరిత రసాయాన్ని కలిపి తన కోపాన్ని అలా చల్లార్చుకుంది. విషం కలిపిన గంజి తాగిన 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా..వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా తోటి ఉపాధ్యాయురాలితో గొడవ నేపథ్యంలో వాంగ్ యున్ అనే టీచర్ ఆన్‌లైన్‌లో సోడియం నైట్రేట్ అనే విషపూరిత రసాయనాన్ని తెప్పించి దానిని తీసుకొచ్చి స్కూల్లో పిల్లలకు ఇచ్చే సూప్ లో కలిపినట్టు తేలింది.
అంతేకాదు సదరు టీచర్ 2017 ఫిబ్రవరిలో తన భర్తపైనా ఇటువంటి విష ప్రయోగమే చేసిందని..కానీ అతడు బతికి బయటపడ్డాడని తేలింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తాజాగా, వాంగ్‌కు హెనాన్ ప్రావిన్స్ గత సోమవారం (సెప్టెంబర్28,2020) కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
తీర్పు ఇచ్చే సమయంలో కోర్టు వాంగ్ ను ప్రమాదకరమైన వ్యక్తిగా పరిగణించింది. ఆమె చేసే నేరాలు నీచమైనవీ..దర్మార్గమైవనీ తీవ్రమైన నేరాలు చేసే ఈమె సమాజంలో బ్రతికేందుకు ఏమాత్రం అర్హత లేదని వ్యాఖ్యానిస్తూ మరణశిక్ష విధించింది.