జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసిన ట్రంప్‌.. ఇక అమెరికాలో ఇండియన్స్‌ పరిస్థితి ఏంటి?

ఇటువంటి పౌరసత్వ చట్టం అమెరికాలో ఈ చట్టం సుమారు 100 ఏళ్లపాటు అమల్లో ఉంది.

జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసిన ట్రంప్‌.. ఇక అమెరికాలో ఇండియన్స్‌ పరిస్థితి ఏంటి?

Donald Trump

Updated On : January 21, 2025 / 7:48 PM IST

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్‌ తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల భారతీయులపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ట్రంప్ తన ప్రచార సమయంలో చేసిన ప్రసంగాలు అక్రమ వలసదారుల పిల్లలకు మాత్రమే వర్తిస్తాయని చాలా మంది అనుకున్నారు. అయితే, అమెరికాలో ఉంటున్న వారందరికీ ఇప్పుడు సమస్య వచ్చిపడుతుంది.

అమెరికాలో ఉంటోన్న విదేశీయులకు ఆ దేశంలో పిల్లలు పుడితే వారికి యూఎస్‌ఏ పౌరసత్వం అందించే చట్టాన్ని ట్రంప్‌ రద్దు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను ‘అమెరికన్ పౌరసత్వం అర్థం, విలువను పరిరక్షించడం’ అనే భావనతో తీసుకువచ్చారు.

ఇటువంటి పౌరసత్వ చట్టం అమెరికాలో ఈ చట్టం సుమారు 100 ఏళ్లపాటు అమల్లో ఉంది. శతాబ్ద కాలం పాటు అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికీ ఆ దేశ పౌరసత్వం లభించింది. ఆ చట్టాన్ని 1868లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు.

ఇప్పుడు ట్రంప్ కొత్త సర్కారు ఆ చట్టాన్ని రద్దు చేయడంతో బిడ్డకు జన్మనిచ్చే సమయానికి తల్లిదండ్రులు యూఎస్‌ఏ పౌరులు కాకపోయినప్పటికీ పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు.

అంతేగాక, తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నా అతడు శాశ్వత నివాసి కాకపోతే అతడికి జన్మించే పిల్లలకు కూడా ఆ దేశ పౌరసత్వం రాదు. ఒకవేళ తండ్రి శాశ్వత నివాసి అయి ఉండి, తల్లి మాత్రం తాత్కాలిక వీసా మీద ఆ దేశంలో ఉంటుంటే కూడా ఇదే రూల్ పాటించాల్సి ఉంటుంది.

అమెరికాలో గత ఏడాది చివరి నాటికి మొత్తం 54 లక్షల మంది ఎన్నారైలు ఉంటున్నారు. అంటే ఆ దేశ జనాభాలో ఇది 1.47 శాతం. వారిలో 34 శాతం మంది ఆ దేశంలో జన్మించిన వారే. దీంతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం వల్ల ఇది ఇండియన్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది.

గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులు ఇప్పుడు వారి పిల్లలకు సైతం అక్కడి పౌరసత్వం రాకపోతే ఆ కార్డు జారీ ప్రక్రియ ఇంకా ఆలస్యం కానుంది. దాదాపు 10 లక్షల మంది భారతీయులు గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారందరిపైనా అధిక ప్రభావం పడుతుంది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం కోసం డెలివరీ సమయానికి అమెరికా వెళ్తుంటారు. ఈ పద్ధతికి ఇక స్వస్తి పలుకుతారు.

Target GHMC Mayor : జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో బీఆర్ఎస్..