Imran Khan: నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుంది.. దేశం మీద అణుబాంబు వేయడమే నయం..!

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన బహిరంగ సభలో ఖాన్ మాట్లాడుతూ.. తనను చంపేందుకు పాకిస్థాన్‌తోపాటు విదేశాల్లో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హత్యకు ఎవరు ప్లాన్ చేశారో తనకు...

Imran Khan: నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుంది.. దేశం మీద అణుబాంబు వేయడమే నయం..!

Pakistan

Updated On : May 15, 2022 / 8:57 AM IST

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన బహిరంగ సభలో ఖాన్ మాట్లాడుతూ.. తనను చంపేందుకు పాకిస్థాన్‌తోపాటు విదేశాల్లో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హత్యకు ఎవరు ప్లాన్ చేశారో తనకు తెలిసిందని, నేను ఒక వీడియోను రికార్డ్ చేసాను, అందులో నేను అందరి పేర్లను పేర్కొన్నాను, నన్ను చంపినట్లయితే ఈ వీడియో పబ్లిక్ చేయబడుతుందని ఇమ్రాన్ కాన్ చెప్పాడు. అధికార పార్టీపై ఇమ్రాన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. పాకిస్థాన్ ను దొంగల చేతికి అప్పగించడం కంటే దేశం మీద ఒక అణుబాంబు వేసేయడమే నయమని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.

Imran Khan: తనను తాను గాడిదతో పోల్చుకున్న ఇమ్రాన్.. సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న వీడియో..

దొంగలను దేశంలోకి చొప్పించడం చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. పాత పాలకుల అవినీతి గురించి కథలు చెప్పడానికి బదులు తమ సొంత ప్రభుత్వ పనితీరుపై దృష్టిసారించాలని ఇమ్రాన్ సూచించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ దొంగలు న్యాయ వ్యవస్థ సహా అన్ని సంస్థలనూ నాశనం చేశారని ఇమ్రాన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అయితే ఈనెల 20న జరిగే లాంగ్ మార్చ్ సందర్భంగా ర్యాలీ రాజధానిలోకి ప్రవేశించకుండా వారిని ఏ శక్తి ఆపలేదని ఇమ్రాన్ అన్నారు.

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కేసు నమోదు.. ఎక్కడంటే..

ఈ ప్రదర్శనలో 20లక్షల మంది పాల్గొంటారని, వారి అడ్డుకోవడానికి ఎన్ని కంటెయిన్లు పెట్టినా ఆగేది లేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఏప్రిల్‌ నెలలో పాకిస్థాన్ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ అధికారాన్ని కోల్పోయాడు. ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ అధికార పార్టీపై విరుచుకు పడుతున్నారు.