Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కేసు నమోదు.. ఎక్కడంటే..

పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కేసు నమోదైంది. ఆ ఆదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు మరో 150 మందిపై ఎఫ్ఐఆర్

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కేసు నమోదు.. ఎక్కడంటే..

Imran Khan

Imran Khan: పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కేసు నమోదైంది. ఆ ఆదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు మరో 150 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంతకీ ఇంత మందిపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారంటే.. పాకిస్థాన్ ప్రధానిగా ఇటీవల షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి ఇమ్రాన్ ఖాన్ వర్సెస్ షెహబాజ్ షరీఫ్ మధ్య పాకిస్థాన్లో మాటల యుద్ధం సాగుతుంది. షెహబాజ్ షరీఫ్ ఎక్కడికి వెళ్లిన ఇమ్రాన్ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారట. తాజాగా సౌదీ అరేబియాకు వెళ్లిన ప్రధాని షరీఫ్ బృందంపై అక్కడి కొంతమంది అనుచిత నినాదాలు చేశారని, వారిలో చాలా మంది ఇమ్రాన్ మద్దతు దారులు ఉన్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

Imran khan : మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు ఎఫ్ ఐఆర్ లో పోలీసులు తెలిపారు. అయితే లాహోర్‌కి 180 కి.మీ దూరంలో ఉన్న ఫైసలాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అనుచిత నినాదాలతో పవిత్ర మదీనా ప్రాంతాన్నిఅపవిత్రం చేశారంటూ స్థానిక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఎఫ్ఐఆర్ నమోదులో గతంలో ఇమ్రాన్ కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన ఫహద్ చౌదరి, షేక్. రషీద్, జాతీయ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరీ సహా లండన్ లోని ఇమ్రాన్ సన్నిహితులు అనిల్ ముసారత్, సాహిజ్ జాదా జహంగీర్ లను కూడా చేర్చారు. ఇప్పటికే సౌదీలోని పోలీసులు నినాదాలు చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పాకిస్థాన్ లోని పంజాబ్ పోలీసులు తెలిపారు.