Imran khan : మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తరువాత భారత్‌పై ప్రేమ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల పలుసార్లు భారత్‌పై పొగడ్తల వర్షం...

Imran khan : మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్

Imran

Imran khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తరువాత భారత్‌పై ప్రేమ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల పలుసార్లు భారత్‌పై పొగడ్తల వర్షం కురిపించిన ఇమ్రాన్ ఖాన్, తాజాగా మరోసారి పాకిస్థాన్‌ను తిట్టుకుంటూ భారత విదేశీ విధానమే ఉత్తమమంటూ పొగిడారు. భారత్ ప్రభుత్వ విదేశీ విధానం వారి ప్రజల శ్రేయస్సు కోసం ఉంటుందని, పాకిస్థాన్ అలా కాదంటూ ఆవేదన వెలిబుచ్చాడు. పాక్ విదేశీ విధానం ప్రజల కోసం కాకుండా వారి స్వప్రయోజనాల కోసం ఉంటుందని తిట్టిపోశాడు. అంతర్జాతీయ వేదికపై భారత్ అనుసరిస్తున్న వైఖరిపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు.

Imran khan: ఇమ్రాన్ ఖానా మజాకా.. 15కి.మీ దూరంకు హెలికాప్టర్‌లో ప్రయాణం.. 40కోట్లు ఖర్చు..

లోహోర్‌లో జరిగిన బహిరంగ సభలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. రష్యా, అమెరికాల మధ్య భారత్ వ్యూహాత్మకంగా మసులుకుంటుందని కొనియాడారు. ఓవైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటూనే, మరోవైపు రష్యా నుంచి భారత్ అయిల్ దిగుమతి చేసుకుంటోందని, వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భారత్ ఆ నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. కానీ పాక్ విదేశీ విధానం మాత్రం ప్రజల ప్రయోజనాలకు చాలా దూరంగా ఉందంటూ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ లోని తాజా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ఇమ్రాన్ పలు సందర్భాల్లో భారత్ విదేశీ విధానాన్ని ప్రశంసించారు.

Imran Khan: విదేశీయుల నుంచి విరాళాలు అడుగుతున్న ఇమ్రాన్ ఖాన్

ఇదిలా ఉంటే తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు స్థానిక నాయకత్వంతో కలిసి విదేశీ శక్తులు కుట్రలు పన్నాయంటూ ఇమ్రాన్ ఖాన్ మరోసారి ఆరోపించారు. అవిశ్వాస తీర్మాణంలో ఓటమి పాలైన నాటి నుంచి ఇమ్రాన్ ఖాన్ విదేశీ కుట్ర అనే అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం పాక్ లో అధికార పార్టీలోని నేతలు సైతం ఇమ్రాన్ వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తున్నారు.