ముక్కలైపోతుంటే : మధుసూధనాచారి కంటతడి..

  • Published By: Mahesh ,Published On : December 25, 2018 / 06:36 AM IST
ముక్కలైపోతుంటే : మధుసూధనాచారి కంటతడి..

Updated On : December 25, 2018 / 6:36 AM IST

తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూధనాచారి కంటతడి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించినా..రాష్ట్రానికి తొలి స్పీకర్ గా పనిచేసిన మధుసూదనాచారి ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. భూపాలపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మధుసూధనాచారి కంటతడి పెట్టారు. 
తాను జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏర్పాటుకు ఎంతో కష్టపడ్డాననీ ఇప్పుడీ జిల్లా ముక్కలవుతుందని వస్తున్న వార్తలు వినడంతోనే తన గుండె తరుక్కుపోతోందని తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తన గుండె ముక్కలైపోతుంది అన్నంత బాధగా వుందని కన్నీరు పెట్టుకున్నారు. ఓటమి తన మనసును కలచివేసిందనీ..భూపాలపల్లిని అన్ని జిల్లాల కంటే ఎక్కువగా అభివృద్ధి చేయాలని ఎన్నో కలలు కన్నాననీ ఇప్పుడు ఈ జిల్లా విడిపోతుందనే వార్తలు చాలా చాలా బాధిస్తున్నాయన్నారు. పార్టీలో ఉన్న కొందరు తనకు నమ్మక ద్రోహం చేశారని ఆరోపించిన మధుసూధనాచారి త్వరలో జరిగే పంచాయతీ..ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు గెలిచేలా కృషి చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు. 
కాగా ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రజలకు వాగ్దానం చేసిన క్రమంలో కొత్త జిల్లాలకు సంబంధించిన ఇప్పటికే అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారి చేసిన విషయం తెలసిందే. ఈ క్రమంలో నారాయణపేట్, ములుగు కేంద్రంగా రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహబూబ్‌నగర్, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్ల నుంచి నారాయణపేట్, ములుగు జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. దీంతో భూపాలపల్లి జిల్లా నుండి కొంత ప్రాంతం మరో జిల్లాలో చేరిపోవంటతో మాజీ స్పీకర్ మధుసూధనాచారి ఆవేదన వ్యక్తంచేసారు.