సీన్ రివర్స్ : కప్పలకు లిఫ్ట్ ఇచ్చిన పాము..

సీన్ రివర్స్ అయ్యింది. పామును చూస్తేనే కప్పలు ఆమడ దూరం ఎగురుకుంటు పారిపోతాయి. ఎందుకంటే కప్పల్ని చూడగానే పాములు గుటుక్కున స్వాహా చేసేస్తాయి కాబట్టి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఓ భారీ కొండచిలువపై కప్పలు సరదా సరదాగా సఫారి

  • Published By: veegamteam ,Published On : January 2, 2019 / 05:33 AM IST
సీన్ రివర్స్ : కప్పలకు లిఫ్ట్ ఇచ్చిన పాము..

సీన్ రివర్స్ అయ్యింది. పామును చూస్తేనే కప్పలు ఆమడ దూరం ఎగురుకుంటు పారిపోతాయి. ఎందుకంటే కప్పల్ని చూడగానే పాములు గుటుక్కున స్వాహా చేసేస్తాయి కాబట్టి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఓ భారీ కొండచిలువపై కప్పలు సరదా సరదాగా సఫారి

ఆస్ట్రేలియా : సీన్ రివర్స్ అయ్యింది. పామును చూస్తేనే కప్పలు ఆమడ దూరం ఎగురుకుంటు పారిపోతాయి. ఎందుకంటే కప్పల్ని చూడగానే పాములు గుటుక్కున స్వాహా చేసేస్తాయి కాబట్టి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఓ భారీ కొండచిలువపై కప్పలు సరదా సరదాగా సఫారి చేసాయి. ఇది ఇప్పుడు ట్రెండ్లీ మారి వైరల్ అయిపోయింది. మరి ఆ భారీ సర్పంపై కప్పలు స్వారీ కహానీ ఏమిటో చూద్దాం..   

ఓ కొలనులో కప్పలు వాటి మానాన అవి బతుకుతున్నాయి. కానీ ఒక్కసారి భారీ వర్షాలు కురవటంతో వాగులు,వంకలు పొంగి పొర్లిపోతున్న పరిస్థితుల్లో నీటి ఉదృతికి కప్పలన్నీ వాగులోంచి బైటకొచ్చేందుకు నానా తంటాలు పడ్డాయి. నీటి ఉదృతి నుండి తప్పించుకుని కాసేపు గట్టుపై వద్దామనుకునే సమయంలో అటుగా పోతున్న ఓ భారీ కొండచిలువ కనిపించింది. గెంతుకుంటు ఎంత దూరం పోతాంలే అనుకున్నాయో ఏమో ఈ కప్పలు   పాము తనను తినేస్తుందనే భయం అయినా లేకుండా ఎంచక్కా.. కొండ చిలువపైకి గెంతేసాయి. సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాయి.  ఇదంతా పశ్చిమ ఆస్ట్రేలియాలోని కునునుర్రా ప్రాంతంలో జరిగింది. 

చక్కగా కొండచిలువపైకి ఎక్కిన ఈ మండూకాలు ఆ భారీ సర్పంపై చక్కగా స్వారీ చేస్తున్న అరుదైన దృశ్యాన్ని ఆ కొలను యజమాని పాల్‌ మాక్‌ తన కెమెరాతో క్లిక్ చేశాడు. తరువాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.  సాధారణంగా పాములు కప్పల్ని చూసీ చూడగానే మింగేస్తాయి. కానీ ఈ సీన్‌లో మాత్రం కొండచిలువ కప్పలకు ‘లిఫ్ట్‌’ ఇవ్వడం ఆశ్చర్యం. ఇది చూస్తుంటే చిన్నప్పుడు మొసలిపై సవారీ చేసి..ప్రాణాలు  దక్కించుకునేందుకు మొసలిని బోల్తా కొట్టించి ఒడ్డు చేరుకున్న కోతి కథ గుర్తుకొస్తోంది కదూ..! అదే మరి నీతి కథలన్నీ సామాజిక అంశాల నుండి జరుగుతున్న పరిస్థితుల నుండి పుట్టుకొచ్చినవేనని తెలుస్తోంది కదూ..