కరోనా ఎఫెక్ట్..మాస్క్‌లకు ఫుల్ డిమాండ్: 150 శాతం పెరిగిపోయిన ధరలు..!!

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 09:18 AM IST
కరోనా ఎఫెక్ట్..మాస్క్‌లకు ఫుల్ డిమాండ్: 150 శాతం పెరిగిపోయిన ధరలు..!!

Updated On : February 12, 2020 / 9:18 AM IST

కరోనా వైరస్ ప్రభావంతో మాస్క్‌లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కరోనాను వ్యాపారాలు క్యాష్ చేసుకుంటున్నారు.కేవలం రూ.40 లు ఉండే మాస్క్ లు ఒక్కొక్కటీ రూ.200లకు విక్రయిస్తున్నారు. దీంతో వేరే దారిలేక అంత సొమ్ము చెల్లించి మరో కొనుక్కోవాల్సి పరిస్థితి వచ్చింది. గతంలో ఎప్పడూ లేనంతా భారీగా పెంచేసి పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్నారు. ఏకంగా ఒకటీ రెండూ మూడు కాదు ఏకంగా 150 శాతం ధరలు పెంచేశారు వ్యాపారులు. 

కరోనా భయంతో భారత్ లో కూడా మాస్క్‌‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది. గతంలో ఎన్-95 మాస్క్ లు  సాధారణ మెడికల్ షాపుల్లో కూడా లభించేవి. కానీ ఇప్పుడు కరోనా ప్రభావంతో పెద్ద పెద్ద మెడికల్ షాపుల్లో కూడా వీడి జాడ కనిపించటంలేదు. ఎందుకంటే ఈ మాస్క్ లను భారత్ చైనా నుంచి దిగుమతి చేసుకునేది. కానీ చైనాలో కరోనా వైరస్ దాడి రోజు రోజుకు పెరుగుతుండటంతో చైనాలో అంతకుమించి డిమాండ్ ఉండటంతో భారత్ కు మాస్క్ ల దిగుమతి నిలిచిపోయింది. దీంతో భారత్‌లో మాస్క్‌లు లభించక ఆన్ లైన్ లో కొనుగోలు చేసుకుంటున్నారు. దీంతో ఆన్ లైన్ లో కూడా మాస్క్‌లు రేట్లు భారీగా పెరిగిపోయాయి. 

N95 మాస్క్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాయి కాలుష్యాన్ని అడ్డుకోవటంతో N95 మాస్క్ లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఐదు పొరలుగా ఉండే ఈ N95 మాస్క్ లు ఉంటాయి. అందుకే వీటికి అంత డిమాండ్ ఉండి. అత్యంత సూక్ష్మ ధూళికళాలను కూడా నియంత్రించగలవు ఈ N95 మాస్క్‌లు. గాలి పీల్చినప్పుడు వైరల్ ముక్కులోకి, నోటిలోకి వెళ్లకుండా ఆపగలదు. 

కాగా..చైనాలో కరోనా ప్రభావంతో మాస్క్ లకు ఫుల్ డిమాండ్ ఏర్పడటంతో దాన్ని కొనుక్కోలేనివారు చిత్ర విచిత్రమైన మాస్క్ లను స్వంతంగా తయారు చేసుకుంటున్నారు. బ్రాలు, డైపర్లు, శానిటరీ నాప్కిన్‌, నిమ్మ లేదా నారింజ తొక్కలు,5 లీటర్ల వాటర్ అండ్ ఆయిల్ బాటిల్స్ లను మాస్కులుగా ధరిస్తున్నారు.